Home / Rahul Gandhi
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ వరకు ట్రక్కులో ప్రయాణించారు.ట్రక్ రైడ్ సమయంలో అతను కొన్ని పాటలను ప్లే చేయమని డ్రైవర్‌ను అభ్యర్థించారు. ఏ పాట అని అడిగినప్పుడు, అతను సిద్ధూ మూస్ వాలా యొక్క 295 పాటను ప్లే చేయండిఅని బదులిచ్చారు.
భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వాషింగ్టన్‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఇంటరాక్షన్‌లో భారత్ లోని ప్రతిపక్షాల ఐక్యత, బలం గురించి విశ్వాసం వ్యక్తం చేసారు.
అమెరికాలో 10 రోజుల పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో తీవ్ర గందరగోళం రేగింది.. ఖలిస్తానీ మద్దతుదారుల బృందం అకస్మాత్తుగా ప్రేక్షకుల నుండి లేచి, అతని ప్రసంగానికి అంతరాయం కలిగించడానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖలిస్తానీ జెండాను ఊపడం ప్రారంభించారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన చర్చా వేదికలో రాహుల్ పాల్గొన్నారు. హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ధీమా వ్యక్తం చేశారు.ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎన్నికల సన్నద్ధత సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత మధ్యప్రదేశ్‌లో పార్టీ విజయ పరంపరను కొనసాగిస్తుందని అన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం కొత్త సాధారణ పాస్‌పోర్ట్‌ను అందుకున్నారు,గాంధీకి ఆదివారం పాస్‌పోర్టు మంజూరు చేస్తామని పాస్‌పోర్ట్ కార్యాలయం హామీ ఇచ్చిందని, మధ్యాహ్నం దానిని పొందారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాహుల్ అమెరికాలో మూడు నగరాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.
కర్ణాటక కాంగ్రెస్ నేత టీబీ జయచంద్ర మనవరాలు తన తాతను మంత్రిని చేయాలని రాహుల్ గాంధీకి లేఖ రాసింది. ఇటీవల జరిగిన కర్నాటక మంత్రివర్గ విస్తరణలో తన తాతయ్యకు చోటు దక్కకపోవడంతో జయచంద్ర మనవరాలు ఆర్ణా సందీప్ రాహుల్ గాంధీకు లేఖ రాసింది.
ప్రతిపక్ష పార్టీల బహిష్కరణ పిలుపు మధ్య ఆదివారం కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పట్టాభిషేకంగా పరిగణించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటును ఆయన ప్రజలగొంతుగా అభివర్ణించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనకు జారీ చేసిన డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేశారు.క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేలడంతో మార్చిలో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పై అనర్హత వేటు పడింది
: కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ పాస్‌పోర్ట్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు శుక్రవారం పాక్షికంగా అనుమతించి మూడేళ్లపాటు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) మంజూరు చేసింది. నేను మీ దరఖాస్తును పాక్షికంగా అనుమతిస్తున్నాను.