Home / President Draupadi Murmu
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భూదాన్ పోచంపల్లిని సందర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఆమె ముందుగా పట్టణంలోని ఆచార్య వినోబా భావే భవన్‌కు వెళ్లారు. అక్కడ వినోబా భావే, వెదిరె రామచంద్రారెడ్డి చిత్రపటాలకు ఆమె నివాళులర్పించారు.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. ఈరోజు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. డిసెంబర్ 23న తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాంచీలో సుమారు రూ550 కోట్లతో నిర్మించిన జార్ఖండ్ హైకోర్టు కొత్త భవనాన్ని ప్రారంభించారు. సుమారుగా 165 ఎకరాలల్లో ఉన్న కొత్త హైకోర్టు విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్దది.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. 2009లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పూణె వైమానిక దళ స్థావరం నుండి ఫ్రంట్‌లైన్ సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు. దీనితో ముర్ము యుద్ధ విమానంలో ప్రయాణించిన రెండవ మహిళా దేశాధినేత అయ్యారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఏపీలో ఉండనున్నారు ఆమె. గతంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఏపీ వచ్చిన ఆమె.. ఈసారి రాష్ట్రపతి హోదాలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల్ గిరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడి స్థానికులతో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
భాజపా పాలిత రాష్ట్రం కర్ణాటకలో అధికారుల వేధింపులు తాళలేక దంపతుల జంట చనిపోయేందుకు నిశ్చయించుకొన్నారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ వ్రాశారు.
వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ గురువారం అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్య దుమారం రేపింది.