Home / Pitapuram constituency
Deputy CM Pawan Kalyan in Pitapuram Constituency: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమండ్రి, కాకినాడ రోడ్డు పనులను పరిశీలించారు. తొలుత రాజమండ్రి నుంచి పిఠాపురం వెళ్లే రూట్లలో రామస్వామిపేట సమీపంలో ఏడీబీ పనులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ పనుల నిర్మాణంపై కలెక్టర్లను ఆరా తీశారు. ఈ మేరకు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు ప్రశాంతి, షాన్ మోహన్ పనుల వివరాలను పవన్ కల్యాణ్‌కు వివరించారు. […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మీడియాకు అండగా ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ వెంట జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు.