Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
Deputy CM Pawan Kalyan in Pitapuram Constituency: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమండ్రి, కాకినాడ రోడ్డు పనులను పరిశీలించారు. తొలుత రాజమండ్రి నుంచి పిఠాపురం వెళ్లే రూట్లలో రామస్వామిపేట సమీపంలో ఏడీబీ పనులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ పనుల నిర్మాణంపై కలెక్టర్లను ఆరా తీశారు. ఈ మేరకు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు ప్రశాంతి, షాన్ మోహన్ పనుల వివరాలను పవన్ కల్యాణ్‌కు వివరించారు.
అనంతరం ఆ రోడ్డు వెంట కాలినడకన బయలుదేరారు. మార్గమధ్యలో డ్రెయిన్ సౌకర్యంతో పాటు నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించారు. అంతేకాకుండా ఇటీవల గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న కొంతమంది యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వదిశలేరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకుు చనిపోయారు. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు.
గత ఐదేళ్లలో ఈ రోడ్డు మార్గంలో దాదాపు 378 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 178 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్డు ప్రమాదం తర్వాత రోడ్డు పనులు చేపట్టారు. పవన్ కల్యాణ్‌తో పాటు కాకినాడ ఎంపీ శ్రీనివాస్, కూటమి నాయకులు పాల్గొన్నారు.