Home / PFI
ఆర్ఎస్ఎస్ ను మూడు సార్లు నిషేధించారు. అయినా పనితీరు ఆగలేదు. సిమీని బ్యాన్ చేస్తే ఏం జరిగిందో చూడండి. నిషేధించడమే పరిష్కారానికి మార్గం కాదని, అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి పలకాలి, బుల్ డోజర్ రాజకీయాలను నిలిపివేయాలి అంటూ సీపీఐ-ఎం నేత సీతారం ఏచూరి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా రెండు రౌండ్ల దాడులు మరియు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( పిఎఫ్ఐ) కు చెందిన 240 మంది సభ్యులని అరెస్టు చేసిన తరువాత కేంద్రం తీవ్రవాద కార్యకలాపాల ఆరోపణల పై ఐదేళ్ల పాటు పిఎఫ్ఐ ను నిషేధించింది.
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) సంస్థ పై రెండవ రౌండ్ దేశవ్యాప్త దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 247 మందిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్ఐఎ సోదాలు జరుగుతున్నాయి.
మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దసరా ఉత్సవాల్లో హింసకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నాగపూర్ అర్ ఎస్ ఎస్ కార్యాలయం వద్ద పీఎఫ్ఐ నేతలు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.
మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముంబైలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్త నుంచి 'ప్లాన్ 2047' అనే బుక్‌లెట్‌ను స్వాధీనం చేసుకుంది. పిఎఫ్ఐ మరియు దాని 'దేశ వ్యతిరేక' కార్యకలాపాల పై దేశవ్యాప్తంగా అణిచివేతలో భాగంగా ఈ దాడి జరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్టు ఎన్ఐఎ అధికారులు గుర్తించారు. పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం చేశారని, దాడులు చేసేందుకు పలువురికి శిక్షణ ఇచ్చినట్టు నిర్ధారించారు.