Sitaram Yechuri: నిషేధించడమే పరిష్కారానికి మార్గం కాదు.. సీతారాం ఏచూరి
ఆర్ఎస్ఎస్ ను మూడు సార్లు నిషేధించారు. అయినా పనితీరు ఆగలేదు. సిమీని బ్యాన్ చేస్తే ఏం జరిగిందో చూడండి. నిషేధించడమే పరిష్కారానికి మార్గం కాదని, అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి పలకాలి, బుల్ డోజర్ రాజకీయాలను నిలిపివేయాలి అంటూ సీపీఐ-ఎం నేత సీతారం ఏచూరి పేర్కొన్నారు.
Thiruvananthapuram: ఆర్ఎస్ఎస్ ను మూడు సార్లు నిషేధించారు. అయినా పనితీరు ఆగలేదు. సిమీని బ్యాన్ చేస్తే ఏం జరిగిందో చూడండి. నిషేధించడమే పరిష్కారానికి మార్గం కాదని, అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి పలకాలి. బుల్ డోజర్ రాజకీయాలను నిలిపివేయాలి అంటూ సీపీఐ-ఎం నేత సీతారం ఏచూరి పేర్కొన్నారు.
తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) దాని అనుబంధ సంస్ధల పై ఐదేళ్ల పాటు కేంద్రం నిషేధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. వారిని రాజకీయంగా ఏకాకిని చేసి, నేరస్థులపై దృఢమైన పాలనాపరమైన చర్యలు తీసుకోవడమే మంచి మార్గమని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ఆధ్వర్యంలో కేరళ “ఉగ్రవాదానికి హాట్‌స్పాట్” అని ఆరోపించిన బిజెపి చీఫ్ జెపి నడ్డాకు ఏచూరి కౌంటర్ ఇచ్చారు. ప్రతీకార హత్యలను ఆపాలని, రాష్ట్ర పరిపాలన పై చర్య తీసుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు చెప్పాలని నడ్డాకు కమ్యూనిస్ట్ నేత విజ్నప్తి చేశారు. మతాల మద్య చిచ్చు పెట్టడం, ద్వేషం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేలా ప్రవర్తించడం సమాధానం కాదని అన్నారు. ఆరోపణలు చేయడం సులభమని, దాని కట్టడికి యంత్రాంగం పని చేయాలంటే రుజువు చూపాలని ఆయన వ్యాఖ్యానించారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 (37 ఆఫ్ 1967)లోని సెక్షన్ 3లోని సబ్-సెక్షన్ (1) కింద కేంద్ర ప్రభుత్వం బుధవారం పిఎఫ్ఐ పై నిషేధాన్ని ప్రకటించింది. రిహాబ్ ఇండియా ఫౌండేషన్ , క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా , ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ , నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ , నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా సహా దాని అసోసియేట్‌లను కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
ఇది కూడా చదవండి: ఆర్ఎస్ఎస్ ను నిషేధించండి.. లాలూ ప్రసాద్ యాదవ్