Home / PD Act
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పీడీ చట్టం కింద చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ధర్మాసనం మంజూరు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దనింది.
మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఈ ఏడాది ఆగస్టు 25న ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
రాజాసింగ్ పై పెట్టిన పీడీ యాక్ట్‌ను అడ్వైజరీ బోర్డు సమర్ధించింది. తనపై పీడీ యాక్ట్ కేసు కొట్టివేయాలన్న రాజాసింగ్ విజ్ణప్తిని సలహామండలి కమిటి తిర్కసరించింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తరపున ఆయన భార్య ఉషాబాయి మరోసారి హైకోర్టుని ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు రాజా సింగ్ పై నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ ఆమె ఇప్పటికే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న ఎంఐఎం నేత కషఫ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో సయ్యద్ అబ్దుల్ ఖాద్రీ అలియాస్ కషఫ్ మత విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదైంది. మంగళ్‌హాట్ పీఎస్‌లో రాజాసింగ్‌పై రౌడీషీట్ ఓపెన్ చేశారు. రాజాసింగ్‌ను రౌడీషీటర్‌గా పోలీసులు పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారు.