Last Updated:

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు.. హైకోర్టు

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పీడీ చట్టం కింద చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ ధర్మాసనం మంజూరు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దనింది.

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు.. హైకోర్టు

Hyderabad: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పీడీ చట్టం కింద చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ ధర్మాసనం మంజూరు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దనింది.

సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ రాజాసింగ్‌ పై పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 40 రోజులుగా ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. దీనిపై అడ్వైజరీ బోర్డు కూడా విచారణ చేపట్టింది. ఆయన పై పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ సబబనే పేర్కొనింది. అయితే విద్వేష పూర్తి ప్రసంగాలు చేయలేదని, మతపరంగా ఎవ్వరిని కించపరచలేదని, కేవలం బాల్య వివాహం అనే ఒక నాటకాన్ని మాత్రమే ప్రజెంట్ చేసాడని రాజాసింగ్ తరపున న్యాయవాదులు వాదించారు.

ఆయన బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రాజాసింగ్ పై ఉన్న 101 కేసుల్లో 18 కేసుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని కూడా కోర్టు దృష్టి తీసుకొచ్చారు. సుదీర్గ వాదనలు అనంతరం ఎట్టకేలకు రాజాసింగ్ కు బెయిల్ మంజూరైంది. తొలుత నాంపల్లి కోర్టు ఆయన రిమాండ్ చెల్లదని రిజెక్ట్ చేసింది. అయితే ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి: ED Raids: మంత్రి గంగుల నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు!

ఇవి కూడా చదవండి: