Home / NTR Health University
విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చడంపై బాలకృష్ణ స్పందించారు. మార్చటానికి, తీసేయ్యడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని, తెలుగు జాతి వెన్నెముక అని ట్వీట్ చేశారు.
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు పై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒకరి పేరు తీసి ఇంకొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం. వైఎస్ఆర్ స్థాయిని పెంచదని, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని చెప్పారు.
చనిపోయిన వారితో జగన్ రాజకీయాలు..ఏపీ సర్కార్ కు బీజేపీ బిగ్ షాక్
ఏపీ శాసనసభలో ఆన్ లైన్ పేరుతో తెల్లవారుజామున తీసుకొచ్చిన పేరు మార్పు జీవో రద్దు చేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరారు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చిన జగన్ ప్రభుత్వానికి షర్మిల చీవాట్లు పెట్టారు. తెలంగాణ పరిగి నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న ఆమె ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టారు.
డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించటం పై దివంగత ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీనిపై ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేసారు.
ఏపీ చరిత్రలో నేడు బ్లాక్ డే అని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ యూనివర్సిటీగా మార్చడాన్ని ఆయన ఖండించారు. హెల్త్ యూనివర్సిటీ కట్టింది ఎన్టీఆర్ అని, వైఎస్ఆర్కు దానితో ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్పు పై రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది. తెదేపా నేతలతోపాటుగా పలు అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో నిరసిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో గంధరగోళం పరిస్ధితులు ఏర్పడ్డాయి.
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా పేరు మార్చడం పై భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నింటీని ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ ది అని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ వర్శిటీ పేరును ఇకపై వైఎస్ఆర్ వర్శిటీగా మారుస్తూ ఏపీ శాసనసభ ఆమోద ముద్ర వేసింది. మంత్రి విడదల రజనీ సభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు.