Home / No-confidence motion
పార్లమెంట్లో ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై కౌంటర్ ఎటాక్ చేశారు. విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని.. వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని చురకలంటించారు
కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోమంత్రి అమిత్షా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఈ సభలో ఒక వ్యక్తి 13 సార్లు రాజకీయ కెరీర్ ప్రారంభించి, 13 సార్లు ఫెయిల్ అయ్యారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.
మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ప్రతిపక్షాల నుంచి చర్చ ప్రారంభించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చను మంగళవారం లోక్సభలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ప్రారంభించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేటి నుంచి పార్లమెంట్లో చర్చ ప్రారంభమయింది. వివాదాస్పద మణిపూర్ సమస్యపై ప్రధాని మోదీ పై వత్తిడి తెచ్చేందుకు I.N.D.I.A (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్) కూటమి యొక్క సమిష్టి ప్రయత్నాల మధ్య అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు, పాలక సభ్యుల మధ్య వాగ్వాదానికి వేదికైంది.
మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బుధవారం నోటీసులు సమర్పించాయి.లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ లోక్సభ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి నోటీసు ఇచ్చారు.