Home / Nationalist Congress Party
హైదరాబాద్ వేదికగా ఈ రోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనుండగా.. రేపు సాయంత్రం తుక్కగూడలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
శరద్ పవార్‌కు వ్యతిరేకంగా అజిత్ పవార్ చేసిన తిరుగుబాటును ప్రస్తావిస్తూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) విద్యార్థి విభాగం ఈ రోజు ఢిల్లీ కార్యాలయం వెలుపల "గద్దర్" (ద్రోహి) పోస్టర్‌ను ఉంచింది. అజిత్ పవార్‌ను "అమరేంద్ర బాహుబలి" శరద్ పవార్‌ను వెన్నుపోటు పొడిచే "కట్టప్ప"గా చూపిస్తూ 'బాహుబలి' చిత్రంలోని ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ రాష్ట్రవాడీ విద్యార్థి కాంగ్రెస్ పోస్టర్‌ను ఉంచింది.
ముంబైలో తన పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అజిత్ పవార్ వర్గం, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు (బిజెపి) ఎన్‌సిపిని అవినీతిమయం అన్నారు. మరి ఇప్పుడు ఎన్సీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఉద్ధవ్ ఠాక్రేకు ఏం జరిగిందో అదే రిపీటయిందని శరద్ పవార్ అన్నారు.
ఎన్సీపీకి చెందిన జయంత్ పాటిల్ అజిత్ పవార్ మరియు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను తమ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు ఇచ్చినట్లు చెప్పారు. ఎన్సీపీ శ్రేణులు పార్టీ అధినేత శరద్ పవార్‌కు అనుకూలంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్‌కు ఇ-మెయిల్ కూడా పంపినట్లు పాటిల్ తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా 2,165 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 31 లక్షల 33 వేల 54 మంది ఓటర్లు ఉన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ తన పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న రెండు రోజుల తరువాత, శుక్రవారం ఆయన ఏర్పాటు చేసిన 18 మంది సభ్యుల కమిటీ అతని రాజీనామాను తిరస్కరించింది.