Home / national news
బెంగళూరులో అకాల వర్షాల కారణంగా కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల నిండా విపరీతంగా చెత్త పేరుకు పోయింది. చెత్తను తొలగించలేక మున్సిపల్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ బైక్ ల వినియోగాన్ని ప్రోత్సహించేలా కొనుగోలుదారులకు అందించే సబ్సిడీని భారీగా తగ్గించనుంది. దీంతో ఈవీ బైక్స్ ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి.
నిరుద్యోగులకు తపాలా శాఖ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీ తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 12 వేల 828 గ్రామీణ డాక్ సేవక్ (GDS)ఖాళీలను భర్తీ చేయనున్నారు.
త్రివిద దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’స్కీమ్ లో భాగంగా నిర్వహించిన అగ్నివీరుల నియామక రాత పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ఫలితాలను విడుదల చేసింది.
మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 32 వ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఢిల్లీలోని వీర్ భూమి వద్ద నివాళులు అర్పించారు.
రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చకునేందుకే నరేంద్ర మోదీ సర్కారు 2 వేల నోట్ల ఉపసంహరణ చేసిందని ఆయన తెలిపారు. ఈ అంశంపై విచారణ జరపాలని ఖర్గే డిమాండ్ చేశారు.
కర్ణాటక రాష్ట్ర 24 వ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోకి కంఠీరవ స్టేడియంలో రెండో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది.
జున్ మోనీ రాభా మోరికొలాంగ్ పోలీస్ ఔట్ పోస్టు ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహించే వారు. ఈ క్రమంలో సోమవారం అర్థరాత్రి తన ప్రైవేటు కారులో ఆమె ప్రయాణిస్తుండగా.. అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో యూపీ నుంచి వస్తున్న ఓ కంటైనర్ వాహనాన్ని కారు ఢీకొట్టింది.
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఎంపిక అయిన విషయం తెలిసిందే. తొలి నుంచి సీఎం రేసులో ఉన్న మరో నాయకుడు డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తూ కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.