Bharathiraja : స్టార్ డైరెక్టర్ భారతీరాజా కొడుకు మృతి

Bharathiraja : తమిళ్ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ అతడి కొడుకు మనోజ్ భారతీ రాజా (48) అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఇవాళ ఉదయం మనోజ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మనోజ్‌ను కాపాడేందుకు అన్ని విధాల ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మనోజ్ వెంటిలేటర్‌పై కన్ను మూసినట్లు సమాచారం. మనోజ్ మృతి వార్తను ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. అభిమానులు, సినీ సెలెబ్రెటీలు భారతీరాజా కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మనోజ్ భారతీరాజా 1976లో జన్మించారు. తర్వాత తాజ్ మహల్ అనే సినిమా ద్వారా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ప్రస్తుత్తం మనోజ్ భారతీ రాజాకి ఇద్దరు సంతానం. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న నటుడు మనోజ్ మృతితో భారతీరాజా కుటుంబం ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది.