NCRB data: ఎన్‌సిఆర్‌బి డేటా.. దేశంలో కోల్‌కతాలో అతి తక్కువ రేప్ కేసులు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తాజా నివేదిక ప్రకారం, కోల్‌కతాలో గత ఏడాది భారతదేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో అతి తక్కువ రేప్ కేసులు నమోదయ్యాయి. 2021లో కోల్‌కతాలో 11 అత్యాచార కేసులు నమోదైతే, ఢిల్లీలో 1,226 రేప్ కేసులు నమోదయ్యాయి.
New Delhi: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తాజా నివేదిక ప్రకారం, కోల్‌కతాలో గత ఏడాది భారతదేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో అతి తక్కువ రేప్ కేసులు నమోదయ్యాయి. 2021లో కోల్‌కతాలో 11 అత్యాచార కేసులు నమోదైతే, ఢిల్లీలో 1,226 రేప్ కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీ తర్వాత జైపూర్‌లో 502 రేప్ కేసులు నమోదు కాగా, ముంబైలో ఐపీసీ సెక్షన్ 376 కింద 364 అత్యాచార కేసులు నమోదయ్యాయి. కోల్‌కతాతో పాటు, 12 అత్యాచార కేసులు నమోదైన తమిళనాడులోని కోయంబత్తూర్, 30 రేప్ కేసులు నమోదైన పాట్నా జాబితాలో దిగువన ఉన్నాయి. ఇతర మెట్రోలలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 165 కేసులు, బెంగళూరులో 117 కేసులు, హైదరాబాద్‌లో 116 కేసులు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 115 కేసులు నమోదయ్యాయి. ఈ 19 నగరాల్లో 2021లో 3,208 అత్యాచార కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ తెలిపింది. మొత్తం మీద, భారతదేశంలో గత ఏడాది మొత్తం 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 31,878 మంది బాధితులు ఉన్నారు.
మమత నుంచి ప్రధాని చాలా నేర్చుకోవాలి..
ఎన్‌సిఆర్‌బి నివేదిక నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC), దాని సోషల్ మీడియా హ్యాండిల్లో ప్రధాని పై విమర్శలు గుప్పించింది. ఎన్‌సిఆర్‌బి డేటా కోల్‌కతా దేశంలోనే సురక్షితమైన నగరమని చెప్పడం వరుసగా రెండవ సారి. మమతా బెనర్జీ యొక్క కఠినమైన పర్యవేక్షణ మరియు మా పోలీసు సిబ్బంది అవిశ్రాంత ప్రయత్నాలక ఇది నిదర్శనం. ఏకైక మహిళా ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి చాలా నేర్చుకోవాలి అంటూ టీఎంసీ పేర్కొంది.