Home / national news
కేరళకు చెందిన 25 ఏళ్ల ఇహ్నా షాజహాన్ కేవలం ఒక్కరోజులో 81 ఆన్లైన్ కోర్సులను పూర్తి చేసి ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. ఒక రోజులో అత్యధిక సంఖ్యలో ఆన్లైన్ సర్టిఫికేట్లను సాధించినందుకు అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.
ఈ రోజుల్లో అమ్మాయిలు, అమ్మాయిలు, అబ్బాయిలు అబ్బాయిలు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ వింత ఘటన తమిళనాడులోని చెన్నైలోజరిగినది. ఇద్దరు అమ్మాయిలు పీకల్లోతు ప్రేమించుకొని ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత కమలా పూజారి కటక్‌లోని ఒక ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధికి చికిత్స కోసం చేరినప్పుడు ఒక సామాజిక కార్యకర్త ఆమె చేత బలవంతంగా నృత్యం చేయించారు. ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో పూజారి చేత బలవంతంగా నృత్యం చేసినందుకు సామాజిక కార్యకర్త పై చర్యలు
నటి సోనాలి ఫోగట్ కేసుకు సంబంధించి గోవా పోలీసులు శుక్రవారం హర్యానాలోని హిసార్‌లోని ఫోగట్ నివాసం నుండి మూడు డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఫోగట్ ,ఆమె సహాయకుడు సుధీర్ సంఘ్వాన్ మధ్య డబ్బు లావాదేవీలు జరిగినట్లు పోలీసులకు దొరికిన డైరీల ద్వారా తెలిసింది.
బీజేపీ లోక్‌సభ ఎంపీ నిషికాంత్ దూబే, ఆయన ఇద్దరు కుమారులు, ఎంపీ మనోజ్ తివారీ, డియోఘర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్, తదితరుల పై జార్ఖండ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆగస్ట్ 31న డియోఘర్ విమానాశ్రయం నుండి టేకాఫ్ కోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుండి ‘బలవంతంగా’ క్లియరెన్స్
పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. పంజాబ్‌లోని తన నివాసంలో రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సామాజిక హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాక్షుల తప్పుడు వాంగ్మూలాలను రూపొందించి, అల్లర్లపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన నానావతి కమిషన్ ముందు వాటిని ప్రవేశపెట్టారని తీస్తా సెతల్వాద్‌పై ఆరోపణలు ఉన్నాయి.
అస్సాంలోని మదరసాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తే వాటిపై బుల్డోజర్లు ప్రయోగించడం ఖాయమని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. జిహాదీ కార్యకలాపాలకు మదరసాను ఉపయోగించకపోతే, వాటిని కూల్చే ప్రశ్నే లేదని ఆయన అన్నారు.
ప్రధాని మోదీ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ-నిర్మిత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను శుక్రవారం ప్రారంభించారు. దేశ నావికా బలాన్ని పెంచడానికి సిద్ధంగా ఉంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ యుద్ధనౌకను "కదిలే నగరం"గా అభివర్ణించారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కేరళలోని ఆదిశంకరాచార్యుల జన్మస్థలాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ఎర్నాకులం జిల్లాలోని కాలడి గ్రామంలోని ఆది శంకర జన్మ భూమిని సందర్శించిన చిత్రాలను ప్రధాని అర్థరాత్రి ట్వి ట్టర్ లో పంచుకున్నారు.