Home / national news
అక్రమ ఫోన్ ట్యాపింగ్ మరియు స్నూపింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోర్టు నుంచి అనుమతి లభించడంతో ఏజెన్సీ రామకృష్ణను అరెస్టు చేసారు.
మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై విలువ ఆధారిత పన్నువ్యాట్ (లీటరుకు వరుసగా రూ.5 మరియు రూ.3 తగ్గించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గురువారం తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి అమలు కానున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ.6,000 కోట్ల భారం పడనుంది. ఇంధన ధరల పెంపుతో నష్టపోయిన సామాన్యులకు ఇది మేలు చేస్తుందని
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపధ్యంలో ఉభయ సభల్లో ఉపయోగించకూడని పదాల జాబితాను విడుదల చేసారు. పార్లమెంట్ లో ఇకపై జుమ్లజీవి', 'బాల్ బుద్ధి', 'కోవిడ్ వ్యాప్తి' మరియు 'స్నూప్‌గేట్' వంటి పదాలను ఉపయోగించడం మరియు 'సిగ్గు', 'దుర్వినియోగం', 'ద్రోహం', 'అవినీతి' వంటి పదాలను ఉపయోగించకూడదు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బూస్టర్ డోస్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ అందించనున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ పేరు మార్చుతూ తీసుకున్న నిర్ణయం హాస్యస్పదమని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు. దీనిపై ఆయన ఎన్ సి సి అధినేత శరద్ పవార్ పై విమర్శలు గుప్పించారు.దీన్ని హిందూ-ముస్లిం సమస్యగా మార్చే వారు చాలా మంది ఉన్నారు. ఇది హిందువులు మరియు ముస్లింల గురించి కాదు.