Home / Nadendla Manohar
ప్రైమ్ 9 సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్దిగా పొటీచేసి గెలిచిన నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనులు తెలిపారు. ఈ సందర్బంగా తాజా రాజకీయపరిణామాలపై చర్చించారు.
ఏపీలో రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా మారాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతకు ఒరిగింది సున్నా అని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఫించన్లలో కోత విధించి రూ.291 కోట్లు కాజేసారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గురువారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెలరోజుల్లో 19 వేలమంది ఫించన్లకు కోత పెట్టారని ఆయన చెప్పారు.
: వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. రిటైల్ స్టోర్ మూసేసే ముందు క్లియరెన్స్ సేల్ చేసినట్టు.. ప్రభుత్వ భూములను సీఎం జగన్ క్లియరెన్స్ సేల్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.మంగళగిరి కేంద్రకార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
విశాఖ పట్నంలోని నొవాటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ సత్యనారాయణ ఎంవీబీ వెంచర్ సంబంధించిన రోడ్డును బ్లాక్ చేశారని.. నిరసన వ్యక్తం చేసేందుకు బయలుదేరిన జనసేన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలను పోలీసులు అడ్డుకున్నారు.
మిచౌంగ్ తుఫాన్ తో నష్టపోయిన ప్రతిరైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు. బుధవారం తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర, తెనాలి రూరల్ మండలాల్లో తుఫాను కారణంగా నష్టపోయిన పంటపొలాలను డీటీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆయన పరిశీలించారు.
దమ్ముంటే నాతో చర్చకు ఏ వైకాపా మంత్రి అయినా సిద్దమా అంటూ జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో సమావేశం నిర్వహించారు. పాలవెల్లువ పథకం వైసీపీ నాయకుల కోసం
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో వైకాపాను గద్దె దించడమే లక్ష్యంగా జనసేన, తెదేపా పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓట్లను చీలనివ్వకుండా ప్రజా సంక్షేమం కొరకు ఎన్నికల్లో జనసేన - టీడీపీ కలిసి పని చేస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇటు పార్టీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి
కృష్ణా డెల్టాలో ఎండిపోతున్న పంటలు చూసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రికి ప్రణాళిక లేకపోవటం వల్లే రాష్ట్రంలో పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రజా సమస్యలపై జనసేన ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో అలజడులు సృష్టిస్తున్నారంటూ వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు.