Home / Monsoon rains
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడి చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించినట్టు తెలిపింది.
శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన కురుసింది. లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్‌పల్లిలో వర్షం కురిసింది. కాగా, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఎగువ నుంచి పోటెత్తున్న వరదకు ఉపనదుల సంగమం తోడై గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో గోదావరి ప్రవేశించే నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద తెలంగాణ-మహారాష్ట్రలను కలిపే వంతెనను ఆనుకుని ప్రవాహం కొనసాగుతోంది. ప్రాచీన శివాలయం వరద నీటిలో మునిగిపోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా ప్రవాహం పోటెత్తుతోంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది. ఇది భూమిపైనే కొనసాగుతూ రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
గత కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని రీతిలో వర్షాలు కురిశాయి. కాగా ఇక నుంచి సెంట్రల్ తెలంగాణలో వర్షాలు ఎక్కువగా కురవనున్నాయి. హైదరాబాద్్,జనగామ, యాదాద్రి, మహబూబ్‌బాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలతో పాకిస్తాన్ వణుకుతోంది. ఎడతెరిపిలెకుండా కురుస్తున్న వానలకు నెల రోజుల్లో 148 మంది మృత్యువాతపడినట్లు పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా ఇళ్లు, రోడ్లు వంతెనలు కొట్టుకొని పోయాయని.. దేశ వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాక్ అధికారులు తెలిపారు.