Home / Minister KTR
ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ వ్యవహారంలో గంటలు గడిచే కొద్ది పలు కీలక పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. తెరాస ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో పోలీసుల ఎఎఫ్ఐఆర్ పై భాజపా న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసింది.
దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడని, రోజ్ గార్ మేళాతో తెలిసివచ్చిందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశవ్యాప్తంగా చిన్నాపెద్ద ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటారని ఆయన అన్నారు.
రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డి పేటలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. యాది మరిచిండ్రా సార్.. డిగ్రీ కళాశాల ఇప్పిస్తా అన్నారు అంటూ ప్లెక్సీలపై రాతులు ఉన్నాయి. విద్యార్థుల ద్రోహి కేటీఆర్ మాకొద్ది ఈ పాలన అంటూ అందులో రాసి ఉంది.
ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటిఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
దేశంలో చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధానిగా మోదీ అని మంత్రి కేటిఆర్ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో పేర్కొన్నారు
మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. మునుగోడులో కుసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి కేటీఆర్ వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు
మునుగోడు ఉపఎన్నికలు నేపథ్యంలో కారు కమలం పార్టీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా చండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందంటూ పోస్టర్లు వెలిశాయి. కాగా తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఆ 18వేల కోట్లేదో మునుగోడు అభివృద్ధికి ఇస్తే మేం ఎన్నిక బరిలో నుంచి తప్పుకుంటామంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అసలు ఈ ఉపఎన్నికలు రావడానికి ఒక కాంట్రాక్టర్ బలుపే కారణం అంటూ ఆయన ఘాటు విమర్శలు చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు రూపంలో దక్కించుకున్న రూ. 18 వేల కోట్లను మునుగోడు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తే.... తాము మునుగోడు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు చేయిస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి.