Home / minister Ambati Rambabu
నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం తమకు రావాల్సిన వాటా నీటినే తీసుకున్నామని వివరించారు. తమవి కాని ఒక్క నీటి బొట్టునైనా తీసుకునే ప్రసక్తే లేదన్నారు. సాగర్ లో 13వ గేట్ వరకూ ఏపీకి చెందిన భూభాగమని.. మా ప్రాంతాన్ని మేము తీసుకున్నామని తెలిపారు.
ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి అంబటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అక్కడికి కర్రలతో వెళ్లారు. అక్కడ అంబటి రాంబాబుతో టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో టీడీపీ నేత కేతినేని హరీష్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మించిన నాయకుడు భారత దేశంలో లేరని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గుంటూరులో విలేఖరులతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. కేంద్రంలో తాము చక్రాలు తిప్పలేదని, రాష్ట్రపతిని నియమించలేదని అన్నారు.
ఏపీలో 175 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు మంత్రి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఇంట్లో నేడు వైసీపీ నాయకులు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్ లు భేటీ అయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండపడ్డారు. చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పోలవరాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారని మంత్రి అంబటి ప్రశ్నించారు.
తన క్యారెక్టర్ పెట్టి అవమానించారంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ తాజా సినిమా బ్రోపై మండిపడుతున్న ఏపీ మంత్రి అంబటి రాంబాబు కసితో రగిలిపోతున్నారు. బ్రో సినిమా ద్వారా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్‌కి ప్యాకేజి ఇచ్చారంటూ అంబటి ఆరోపిస్తున్నారు. బ్రో నిర్మాతకి అక్రమంగా డబ్బులు వచ్చాయని, ఆ నిర్మాత ద్వారా టిడిపి పవన్ కళ్యాణ్‌కి డబ్బులిచ్చిందని అంబటి చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు, పోలవరానికి పట్టిన శని చంద్రబాబు నాయుడేనని ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ ను నిపుణులు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు తమ హయాంలో పోలవరం పనులు 75 శాతం చేసామని చెప్పారని కాని అది అబద్దమన్నారు.
తెదేపా అధినేత చంద్రబాబు ఒక ముసలి సైకో అని.. అధికారం లేకపోతే ఆయన బతకలేడని వైకాపా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై నెక్స్ట్ లెవెల్ లో ఫైర్ అయ్యారు అంబటి. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో