Home / Latest News
ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. భారీ స్కోర్ చేసినా భారత్ కు ఫలితం దక్కలేదు. కొండంత లక్ష్యం కూడా ఆసీస్ బ్యాటర్ల దూకుడు ముందు కరిగిపోయింది. టాస్ నెగ్గిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈరోజు ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచించి మొదలుపెడితే అన్ని రాశుల వారికి శుభాలు జరుగుతాయి. మరి జన్మనక్షత్ర దృష్ట్యా ఏఏ రాశివారికి వారి జాతకపరిణామం ఎలా ఉంటుందో తెలుసుకుందామా.. నేడు (సెప్టెంబర్ 21వ తేదీ) బుధవారం రాశి ఫలాలను ఒకసారి చూసేద్దాం..
సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో దారుణం చోటు చేసుకొంది. ఓ పాఠశాలపై సైనిక హెలికాప్టర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 7 Children Among 13 Killed After Myanmar Army Helicopter Attacks School
ప్రపంచంలోని మొట్టమొదటి క్లోన్ చేయబడిన వైల్డ్ ఆర్కిటిక్ తోడేలును బీజింగ్‌కు చెందిన సినోజీన్ బయోటెక్నాలజీ వీడియోలో ప్రదర్శించింది.
నిమ్మకాయ.. దీని పేరు వినిపించగానే మన నోట్లో లాలాజలం ఊరిపోవడం సహజం. నిమ్మలో విటమిన్ సీ, ఈ, బీ6 తోపాటు థయామిన్, నియాసిన్, రైబోప్లేవిన్, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. మరి అవేంటో చూద్దామా..
శ్రీహాన్ కోపంగా ‘నోరు అదుపులో పెట్టుకో, వాడు వీడు ఏంటి’ అని గట్టిగా ఇనయాపై అరిచేస్తాడు. ఆ తరువాత రేవంత్ కూడా కలుగజేసుకుని. ‘మొన్న అన్నావ్ వాడు అని, లాగికొడితే..’అంటాడు. దానికి ఇనయా ‘నన్ను కొడతానని ఎలా అంటావ్’ అంటూ ఇంట్లో హడావిడి చేస్తుంది. ఇలా ఈ రోజు బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ నడుస్తుంది.
మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ కూడా తన అధికారిక వెబ్‌సైట్‌పై దివాళీ సేల్‌ను ప్రారంభిస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ సేల్‌లో కంపెనీ వన్‌ప్లస్ 10 ప్రోను రూ 55,999కి విక్రయిస్తోంది.
వెండితెరకు నూతన హీరోగా పరిచయం అవుతున్న విక్రాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘స్పార్క్’ మూవీ తెరకెక్కుతుంది. దీనిలో ఛార్మింగ్ బ్యూటీస్ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పుత్రులు ఇద్దరు కాళభైరవ, శ్రీసింహ మొక్కలు నాటారు.
తెలుగురాష్ట్రాల్లో ఓలా తర్వాత అంత క్రేజ్ ఉబర్ ట్యీక్సీ సర్వీస్ కే ఉందనే చెప్పవచ్చు. కాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్ ట్యాక్సీ సర్వీసెస్ అయిన ఈ ఉబర్ హ్యాకింక్ కు గురైంది. సంస్థకు చెందిన ఓ ఉద్యోగి వర్క్ స్పేస్ మెసేజింగ్ యాప్ లోకి హ్యాకర్లు చొరబడ్డారు. దానితో ఉబర్ డేటా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఉబర్ సంస్థ అఫీసియల్ గా వెల్లడించింది.