Last Updated:

Horoscope: నేటి రాశిఫలాలు( సెప్టెంబర్ 21-2022)

ఈరోజు ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచించి మొదలుపెడితే అన్ని రాశుల వారికి శుభాలు జరుగుతాయి. మరి జన్మనక్షత్ర దృష్ట్యా ఏఏ రాశివారికి వారి జాతకపరిణామం ఎలా ఉంటుందో తెలుసుకుందామా.. నేడు (సెప్టెంబర్ 21వ తేదీ) బుధవారం రాశి ఫలాలను ఒకసారి చూసేద్దాం..

Horoscope: నేటి రాశిఫలాలు( సెప్టెంబర్ 21-2022)

Horoscope: రోజు ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచించి మొదలుపెడితే అన్ని రాశుల వారికి శుభాలు జరుగుతాయి. మరి జన్మనక్షత్ర దృష్ట్యా ఏఏ రాశివారికి వారి జాతకపరిణామం ఎలా ఉంటుందో తెలుసుకుందామా.. నేడు (సెప్టెంబర్ 21వ తేదీ) బుధవారం రాశి ఫలాలను ఒకసారి చూసేద్దాం..

1. మేషరాశి: ఈ రాశివారు కొత్త వాహనం, ఇల్లు మొదలైనవాటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ సమయం దీనికి తగినది కాదు. మీరు మరికొంత కాలం వేచి ఉండాలి. పనికి తగిన ప్రశంసలు అందుతాయి. వ్యాపారస్తులు ఈరోజు మంచి లాభాలను పొందవచ్చు.

2. వృషభ రాశి: కొన్ని రోజులు మీ ఆరోగ్యం బాగాలేకపోతే, మీరు అజాగ్రత్తకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్థులపై ఒత్తిడి అధికమవుతుంది. పనితీరు కూడా క్షీణించవచ్చు. ప్రశాంతమైన మనస్సుతో మీ పనిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. వ్యాపారులకు ఈరోజు చాలా శుభసూచకంగా ఉంటుంది. మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి.

3. మిథున రాశి: మీరు విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఈ రోజు కలిసొస్తుంది. వీసా లేదా పాస్‌పోర్ట్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే, ఈ రోజు మీ సమస్య పరిష్కారం అవుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. తల్లిదండ్రులతో అనుబంధం బలంగా ఉంటుంది.

4. కర్కాటక రాశి: ఈ రోజు మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది, అలాగే పైఅధికారుల మద్దతు లేకపోవడం వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారస్తులు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈరోజు మీరు కూడా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

5. సింహ రాశి: వైవాహిక జీవితంలో శాంతి, సంతోషాలు ఉంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

6. కన్య రాశి: శృంగార జీవితంలో అకస్మాత్తుగా పెద్ద సమస్య రావచ్చు. మీకు మీ భాగస్వామితో విభేదాలు ఉంటే తొలగించడానికి ప్రయత్నించండి. మరోవైపు, మీరు వివాహం చేసుకున్నట్లయితే, మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. వ్యాపారులు ఈరోజు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందవచ్చు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసే సంకేతాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరి

7. తుల రాశి: ఈ రోజు మీరు డబ్బు, ఆరోగ్యం రెండింటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా మీపై అప్పుల భారం కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారస్తులు. మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి.

8. వృశ్చిక రాశి: ఈ రాశి విద్యార్థులకు ఈరోజు చాలా అదృష్టకరమైన రోజు. ఉద్యోగాలు చేసే వ్యక్తులు కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యంపై దృష్టి సారించవలసి ఉంటుంది. కుటుంబంతో కొంత సమయం గడిపితే అంతా సంతోషంగా ఉంటుంది.

9. ధనుస్సు రాశి: వైవాహిక జీవితంలో పెరుగుతున్న అసమ్మతి మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. ఈ రోజు మీకు ఏ పని చేయాలనే భావన ఉండదు. ప్రశాంతమైన మనస్సుతో మీ నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టగలరు. వ్యాపారస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

10. మకర రాశి: మీరు ఉద్యోగం చేసి, ఉద్యోగం మార్చడానికి ఇటీవల ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే, మీరు సానుకూల సమాధానం పొందవచ్చు. వ్యాపారస్తుల ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రోజు మీరు అనుభవజ్ఞుడైన వ్యక్తి సహాయంతో పెద్ద ప్రయోజనం పొందవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది.

11. కుంభ రాశి: డబ్బు విషయంలో ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచి సంకేతాలు ఉన్నాయి. ఈ రోజు మీరు కొత్త ఆస్తి, వాహనం మొదలైనవాటిని కొనుగోలు చేయడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారస్తుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుంచి మానసిక మద్దతు పొందుతారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

12. మీన రాశి: వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా కొంచెం ఒడుదుడుకులు ఎదుర్కొంటారు. పని విషయంలో ఎంత కష్టపడి పని చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారులు ప్రమాదకర నిర్ణయాలను తీసుకోవద్దని, లేకుంటే లాభం స్థానంలో నష్టపోయే అవకాశం ఉందని సూచించారు. ఈరోజు మీకు కంటికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు.

ఇదీ చదవండి: Viral Video: అరుదైన దృశ్యం… కళ్లు మూస్తూ తెరుస్తూ ఉన్న హనుమంతుని విగ్రహం..!

ఇవి కూడా చదవండి: