Home / Latest News
తక్కువ ధరకే అన్ని ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ కొనుగోలు చెయ్యాలనుకునే వారికి భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా గుడ్ న్యూస్ చెప్పింది. అత్యంత సరమైన ధరకే లావా బ్లేజ్ ప్రోను మార్కెట్లో లాంచ్ చేసింది. మరి దీనికి సంబంధించిన వివరాలేంటో చూసేద్దామా...
నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా పలు బ్రాంచుల్లోని ఖాళీలను భర్తీ చెయ్యనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
ఓ ఎలక్ట్రానిక్ షోరూంకి కన్నమేసిన రూ. 70 లక్షలకు పైగా విలువైన చరవాణీలను చోరీ చేశాడు.. కానీ అక్కడనున్న ల్యాప్‌టాప్‌లు కానీ మరే ఇతర వస్తువుల జోలికి కానీ అతడు వెళ్లకపోవడం గమనార్హం. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ చౌరస్తాలో జరిగింది.
ఒకే సమయంలో రెండు కంపెనీలకు పనిచేస్తూ మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రో ఆగ్రహం వ్యక్తం చేసింది. కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 300 మంది సిబ్బందిని గుర్తించి, వారిని తమ ఉద్యోగం నుంచి తొలగించినట్లు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ వెల్లడించారు.
బాధ్యతగా మెలగాల్సిన వైద్యుడి బాధ్యతారాహిత్యం వల్ల నిండు ప్రాణం బలైంది. ఓ డాక్టర్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఆ మహిళకు గర్భశోకం మిగిల్చింది. ప్రసవ వేదనతో ఆస్పత్రిలో చేరిన మహిళను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. పుట్టెడు శోకాన్ని మిగిల్చారు. వైద్యుడి వీడియో కాల్ సూచనల మేరకు నర్సులు ఆమెకు డెలివరీ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పుట్టు సునంబేడు గవర్నమెంట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
రాజకీయాలు నాకు దూరం కాదు అంటూ చిరంజీవి అటు అభిమానుల్లోనూ ఇటు రాజకీయనేతల్లోనూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కొత్త ఐడీ కార్డును జారీ చేసింది. పీసీసీ డెలిగేట్‌గా చిరును గుర్తిస్తూ ఈ కొత్తకార్డును ఇచ్చింది. ఈ కార్డుకి 2027 వరకు కాలపరిమితి వుంటుందని తెలిపింది.
సాధారణంగా మనం అన్నం తింటుంటాం కాబట్టి దాన్ని స్థానాన్ని మరేదీ భర్తీ చేయలేదని అనుకుంటుంటాం. వరి బియ్యంతో చేసిన అన్నం ఒక్కటే కాకుండా ఇదే తరహాలో వెదురు బియ్యంతో కూడా అన్నం వండుకోవచ్చటా.. వెదురు బియ్యమా అవెక్కండుటాయి ఎలా ఉంటాయి అనుకుంటున్నారా... అయితే ఈ కథనంపై ఓ లుక్కెయ్యండి.
రూ.75కే పెద్దపెద్ద మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూడొచ్చు అంటే మీరు నమ్ముతారా.. కానీ ఇది నిజం. అయితే ప్రతి రోజు ఆ వెసులుబాటు లేదులెండి కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే మల్టీప్లెక్స్ లో రూ. 75లకే సినిమా చూడొచ్చట. అది ఏ రోజంటే సెప్టెంబర్ 23 జాతీయ సినిమా దినోత్సవం రోజు.
హోండా యాక్టివా, హీరోహోండా బైక్‌లు తెలియని భారతీయులు ఉండరు. సామాన్యుల బడ్జెట్‌కు అనుగుణంగా లభించే ఈ టూవీలర్లు తయారీ చేసి హోండా మోటార్ సైకిల్స్ సంస్థ ఆటోమొబైల్ రంగంలో దిగ్విజయంగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ట్రెండ్ కు తగినట్టుగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ అయిన హోండా మోటార్‌సైకిల్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దిగింది. మోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అతి త్వరలో మార్కెట్లో లాంఛ్ చెయ్యనుంది.
ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ (58) ఇక లేరు. స్టాండ్ అప్ కామెడీలో ఒక వెలుగు వెలిగిన శ్రీవాస్తవ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు.