Home / Latest News
ప్రపంచ క్రికెట్లో పాక్ బ్యాటర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. పాకిస్థాన్ వేదికగా ఇంగ్లాండ్ 7 టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. కాగా తొలి మ్యాచ్ లో పాక్ జట్టును మట్టికరిపించిన ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్ లో మాత్రం డీలాపడింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. మొదటి మ్యాచ్ ఓటమికి రెండో మ్యాచ్ తో పాక్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో గతంలో తమ పేరిటే ఉన్న రికార్డును తాజాగా బాబర్-రిజ్వాన్ ల జోడీ తిరగరాసింది.
అటు తమిళం ఇటు తెలుగు చిత్ర పరిశ్రమల్లోనూ సమానంగా క్రేజ్ ఏర్పరుచుకున్న స్టార్ హీరో అజిత్ కుమార్. కాగా ఈ ఏడాది ‘వలిమై’చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే అదే జోష్‌తో వరుసగా సినిమాలను చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు ఈ తమిళ నటుడు. ఇప్పటికే ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. తాజాగా ఈ స్టార్ హీరోకి సంబంధించిన సినిమా నుంచి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చాలా మంది వారు కనపడడం లేదు.. వీరు కనపడడం లేదు.. ఏదైనా వస్తువులను దొంగలిచినట్టు.. లేదా చదువుకున్న సర్టిఫికేట్లు పోగొట్టుకున్నాం దొరికితే ఫలానా అడ్రస్‌కు పంపండి అంటూ పేపర్ల ద్వారానో లేదా సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుండడం చూసాం. కానీ ఒక వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా 'తన మరణ ధృవీకరణ పత్రం’ పోయిందంటూ పత్రికలో ఒక ప్రకటన ఇచ్చాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం ఈ కేసు విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయింది. కాగా అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఈరోజు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఈరోజు మరోసారి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైకి తరలించారు.
ఏ భూకంపం వస్తేనే లేదా నేల కుంగితేనో సడెన్ గా భవనాలు కూలిపోతాయి. అయితే మరి వైయస్ఆర్ జిల్లాలో మాత్రం అకస్మాత్తుగా అర్థరాత్రి వేళ ఓ భవనం కుంగిపోయింది. ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. మరి ఈ ప్రమాదం ఎందుకు ఎలా జరిగిందో ఓసారి చూసేద్దాం..
ఇండియా ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆసీస్ చేతిలో ఒక మ్యాచ్ ఓటమితో ఉన్న ఇండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అయితే ఈ మ్యాచ్ కూడా గెలిసి 2-0తో సిరీస్ దక్కించుకోవాలని ఆసిస్ చూస్తుంది.
ఇరాన్‌లోనూ హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా నిరసన సెగలు వెల్లువెత్తాయి. హిజాబ్ ధరించనందుకు మహసా అమిని అనే యువతి ఆ దేశ పోలీసుల దాడిలో గత శనివారం మృతి చెందింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఇరాన్ నిరసనలతో అట్టుడుకుతుంది. అయితే వీటిని అణచివేసేందుకు ఇరాన్ భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అణచివేతలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 31 మంది మరణించినట్లు ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్నఎన్జీనో సంస్థ వెల్లడించింది.
తెలుగు వారు ఏ రంగంలోనై రాణించగలరు ఎన్ని రికార్డులైనా నెలకొల్పగలరు అన్నది నానుడి కాదండో అక్షరాల నిజం. సంపద సృష్టిలో తెలుగువాళ్లు రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ రిచ్‌లిస్ట్-2022లో మెరుగైన ర్యాంకులన్నీ మన తెలుగువారే సాధించారు.