Home / Latest News
ఆసియాకప్ పరాభవం తర్వాత భారత జట్టు మరో టీ20 సిరీస్ కు సిద్దం అయ్యింది. ఆస్ట్రేలియాతో నేటి నుంచి మూడు మ్యాచ్‌లకు తెర లేవనుంది. మొహాలీ వేదికగా రాత్రి ఏడుగంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలు ముగిసాయి. అంతిమయాత్రను అధికారిక లాంఛనాలతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు.
బీహార్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల పిడుగులు పడడంతో పలువురు చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది మృత్యువాతపడ్డారు
తెలుగుదేశం నేతలు ఛలో అసెంబ్లీకి పిలుపు నివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అసెంబ్లీ పరిసరాలలోనూ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోనూ డ్రోనులను తిప్పతూ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీకి దారితీసే అన్ని మార్గాల్లోనూ పోలీసుల పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. అయినా కానీ పట్టువిడువని విక్రమార్కుల్లా తెదేపా నేతలు అసెంబ్లీ సమీపంలోని ఓ భవనంపైకి ఎక్కి నిరసన చేపట్టారు.
మెక్సికోలో ఒక్కసారిగా భూమి దద్దరిల్లింది. మెక్సికో సెంట్రల్ పసిఫిక్ తీరంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది.
ఈ మధ్యకాలంలో సాయం చెయ్యడం కూడా తప్పు అయిపోయింది. ఏదో పాపాం కదా అని సహాయం చెయ్యాలని చూసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడో వ్యక్తి. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడో కిరాతకుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మళ్లీ కారు మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
భారతీయులను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 200కి.మీ మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ 12రోజున కూడా ఉత్సాహంగా తన పాదయాత్రను కొనసాగించారు
వ్యవస్ధల్లో నూతన వరవడిని సృష్టించాలంటే భారత రాజ్యాంగంలో అనేక సంస్కరణలు, మార్పులు అవసరమంటూ అనేక మంది రాజకీయ నేతలు మాట్లాడుతుంటారు. వారందరికి బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చెక్ పెట్టారు
కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకె శివకుమార్ విచారణ కోసం ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఐదు రోజుల క్రితం మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా దిల్లీ రావాల్సిందిగా డీకె శివకుమార్‌కు నోటీసులు పంపారు