Home / latest news of Andhra Pradesh
మాండూస్ తుఫాను ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంత వాసులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది. కాగా నేడు మాండూస్ బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాలు జలదిగ్భంతో చిక్కుకుని ఉన్నాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. చాలా మంది లోతట్టు ప్రాంత ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా తుఫాను కారణంగా నిరాశ్రయులైన బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాస రావు నేడు విశాఖలోని నోవాటెల్ కి వెళ్లి అక్కడ జనసేనానికి కలిశారు. దీనితో పవన్ తో గంటా చేరనున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంతవరకు ఇద్దరు నేతలు స్పందించలేదు. కానీ ఏపీ రాజకీయాలు చూస్తుంటే ఏక్షణం ఏమైనా జరగొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి గంటా జనసేనానితో చేతులు కలిపితే ఉత్తరాంధ్రలో వైసీపీకి చుక్కలు తప్పవు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెదేపా నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు రాజేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.