Home / latest national news
భారత వాతావరణ శాఖ (ఐఎండి ) వచ్చే వారంలో వర్షాలు కురిసే రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. రాబోయే ఐదు రోజులలో భారతదేశంలోని చాలా ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండవని తెలిపింది.ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు గాలులతో కూడిన మోస్తరు వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ సంస్థ పేర్కొంది,
ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి మరియు పర్యాటకాన్ని పెంచేందుకు మెట్రో ఏర్పాటు చేయబడింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రెండు రోజుల పర్యటనకు బయలుదేరి ముప్పై ఆరు గంటల వ్యవధిలో ఏడు నగరాల్లో ఎనిమిది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 24 మరియు 25 తేదీలలో రెండు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని 5,300 కి.మీలకు పైగా ప్రయాణించనున్నారు.
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ను కీర్తించేవారిని, అతనికి మద్దతుగా మాట్లాడేవారిని కాల్చిపారేయాలని కేంద్రమంత్రి అశ్విని చౌబే అన్నారు.జుమ్మా నమాజ్ చేసిన తర్వాత, వారిలో ఒకరు 'అతిక్ అహ్మద్ అమర్ రహే' అని అరిచాడు.
ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు..ఎలా మారుతాయే అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. గత కొద్దిరోజులుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో
Modi Kerala visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో కేరళ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ నెల 24,25 తేదీల్లో మోదీ కేరళ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడులు జరుపుతామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో రాష్ట్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి గత వారం ఈ బెదిరింపు లేఖ వచ్చింది. ఈ విషయం ఆలస్యంగా […]
Mumbai: ముంబైలో భారీ సెక్స్ రాకెట్ బయటపడింది. మోడల్స్ తో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ నటితో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈస్ట్ ముంబైలోని గోరెగావ్ లోని ఓ హోటల్ లో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ హోటల్ పై పోలీసులు దాడులు చేపట్టారు. మోడల్స్ ను ట్రాప్ చేసి(Mumbai) ఈ దాడుల్లో […]
రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ డెవలపర్ డిఎల్ఎఫ్ల మధ్య జరిగిన భూ ఒప్పందం అవకతవకలపై దర్యాప్తు చేసేందుకు ఈ ఏడాది ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) తిరిగి నియమించామని హర్యానా పోలీసులు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకు తెలియజేశారు.
అస్సాం, అరుణాచల్ప్రదేశ్ల మధ్య 51 ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు గురువారం ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఒప్పందంపై సంతకాలు చేశారు.
దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఆహార వీధులను అభివృద్ధి చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఇవి ఏర్పావుతాయి.