Home / latest national news
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఇద్దరు మైనర్ పిల్లలకు 'దుష్టశక్తులను దూరం చేసేందుకు' వీధికుక్కలతో పెళ్లి చేశారు. 11 ఏళ్ల బాలుడు, తపన్ సింగ్ (దారీ సింగ్ కుమారుడు) ఆడ కుక్కను వివాహం చేసుకోగా, ఏడేళ్ల లక్ష్మి (బుటు కుమార్తె) ఒక మగ కుక్కతో వివాహం చేసుకుంది.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి తరలించారు. పాడెల్ (78) మంగళవారం కడుపునొప్పితో త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పిటల్ లో చేరారు.
చైనా రాజధాని బీజింగ్ లోని ఓ ఆసుపత్రిలో మంగళవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం 12:56 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బీజింగ్‌లోని ఫెంగ్టైలోని ఆసుపత్రి అడ్మిషన్స్ భవనంలో మంటలు చెలరేగాయి. ఇక్కడ ఉన్న దాదాపు 71 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు.
బిల్కిస్ బానో కేసులో దోషులకు క్షమాపణలు మంజూరు చేయడానికి సంబంధించిన ఒరిజినల్ ఫైళ్లతో తాము సిద్ధంగా ఉండాలని మార్చి 27న తాము ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయవచ్చని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సన్నకారు రైతు మింటు రాయ్ (52) తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఉత్తర 24 పరగణాల్లోని హెలెంచా జిల్లా నివాసి అయిన మింటు రాయ్ 20-25 సంవత్సరాల క్రితం సిలిగురిలోని ఫసిదావా ప్రాంతంలో స్థిరపడ్డారు
కర్ణాటక మంత్రి ఎన్ నాగరాజు రాష్ట్రంలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు హోస్కోట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్బంగా ఆయన తన మొత్తం ఆస్తుల విలువ రూ.1,609 కోట్లుగా ప్రకటించారు.
దౌత్య మార్గాల ద్వారా కేరళలోకి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై ఇటీవల జరిపిన సోదాల తర్వాత రూ.1.13 కోట్ల విలువైన ఏడు స్థిరాస్తులు, రూ.27.65 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం వెల్లడించింది.
సూడాన్‌లో సైన్యం మరియు పారామిలిటరీల మధ్య జరిగిన పోరులో సుమారు 200 మంది మరణించగా 1,800 మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో పలు ఆసుపత్రులు దెబ్బతిన్నాయి. వైద్య సామాగ్రి మరియు ఆహారం కొరత ఏర్పడింది.
: గుర్తుతెలియని మృతదేహాల డీఎన్ఏ డేటాబేస్‌ను రూపొందించిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అవతరించిందని సోమవారం ఒక అధికారి తెలిపారు.గత ఏడాది ఏప్రిల్‌లో ఈ ప్రక్రియ ప్రారంభించామని, ఇప్పటివరకు 150 గుర్తుతెలియని మృతదేహాల డీఎన్ఏ నమూనాలను డేటాబేస్‌లో భద్రపరిచామని తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమించి ఆరే అడవుల్లో అనుమతించిన దానికంటే ఎక్కువ చెట్లను నరికివేయడానికి ప్రయత్నించినందుకు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్)కి సుప్రీంకోర్టు సోమవారం 10 లక్షల రూపాయల జరిమానా విధించింది.