Pooja Hegde: ఓహో గులాబీ బాల.. విసరకే అలా వలపుల వల

టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే తెలియని ప్రేక్షకుడు ఉండడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్న పూజా గత రెండేళ్లగా విజయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది.

గతేడాది అంతా సినిమాలు పక్కన పెట్టి కుటుంబంతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేసిన పూజా ఈ ఏడాది వరుస సినిమాలను లైన్లో పెట్టింది.

సూర్య సరసన రెట్రో , విజయ్ సరసన జన నాయగన్ సినిమాల్లో పూజా నటిస్తూ బిజీగా ఉంది.

ఇక సినిమాలు చేయకపోయినా అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్న పూజా తాజాగా ఎర్ర గులాబీలా విచ్చుకుంది.

ఎర్ర గులాబీ డిజైన్ తో ఉన్న లెహంగాను ధరించి.. దానికి మారినంత అందాన్ని తెచ్చే ఆభరణాలతో ఎంతో అద్భుతంగా కనిపించింది.

లెహంగాలో స్కిన్ షో చేయకుండానే పూజా చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది.

ప్రస్తుతం పూజా ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఓహో గులాబీ బాల.. విసరకే అలా వలపుల వల అంటూ కామెంట్స్ పెడుతున్నారు.