Last Updated:

Food streets: దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఫుడ్ స్ట్రీట్స్

దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఆహార వీధులను అభివృద్ధి చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఇవి ఏర్పావుతాయి.

Food streets: దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఫుడ్ స్ట్రీట్స్

Food streets: దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఆహార వీధులను అభివృద్ధి చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఇవి ఏర్పావుతాయి. సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన పద్ధతులను ప్రోత్సహించడం,పౌరుల మొత్తం ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం లక్ష్యంగా వీటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

ఈట్ రైట్ క్యాంపెయిన్..(Food streets)

ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మరియు హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సెక్రటరీ మనోజ్ జోషి ఈ కార్యక్రమం కింద వ్యక్తులకు వారి శ్రేయస్సు కోసం సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహారాన్ని సులభంగా అందచేసే ఆవశ్యకతను వివరిస్తూ రాష్ట్రాలకు లేఖ రాశారు, ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా ఉపయోగించబడుతుంది. మంచి ఆహార పద్ధతులు ఈట్ రైట్ క్యాంపెయిన్, ఆహార భద్రత మరియు స్థానిక తినుబండారాల విశ్వసనీయతను పెంచుతాయని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను పెంచడం మరియు పర్యాటక సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

FSSAI నిబంధనల మేరకు..

జాతీయ ఆరోగ్య మిషన్ (NHM), గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయంతో, భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) నుండి సాంకేతిక సహాయంతో ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తారు. రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి ఫుడ్ స్ట్రీట్/జిల్లాకు రూ. 1 కోటి మేర ఆర్థిక సహాయం అందుతుంది. వీటిలో భాగంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాలకు వంద ఫుడ్ స్ట్రీట్‌లను ప్లాన్ చేశారు. వీటికి 60:40 లేదా 90:10 నిష్పత్తిలో సహాయం అందించబడుతుంది, FSSAI నిబంధనలకు అనుగుణంగా ఈ ఫుడ్ స్ట్రీట్‌ల యొక్క ప్రామాణిక బ్రాండింగ్ పూర్తి చేయబడాలి.

ఫుడ్ స్ట్రీట్‌లను ఆధునీకరించడం, ఫుడ్ హ్యాండ్లర్‌లకు అవగాహన కల్పించడం, స్వతంత్ర థర్డ్-పార్టీ ఆడిట్‌లు నిర్వహించడం మరియు ఈట్ రైట్ స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల గుర్తింపు కోసం ప్రామాణిక ప్రోటోకాల్‌ను నిర్వచించడంతో సహా ఇతర చర్యలు తీసుకోబడతాయి.వీధి విక్రయదారులకు ఆహార భద్రత, పరిశుభ్రత నిర్వహణ మరియు చెత్త పారవేయడంపై శిక్షణా కార్యక్రమాలు కూడా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించబడ్డాయి.