Home / latest national news
సాధారణంగా బ్యాంకులు లక్షలాది రూపాయల డిపాజిట్ అంటే కళ్లకద్దుకుని తీసుకుంటాయి. అది కూడా దేవాలయాలు, దేవస్దానాలకు చెందినవయితే ఎటువంటి అభ్యంతరాలు ఉండవు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ ముఖర్జీ నగర్ ప్రాంతంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో సంభాషించారు
శుక్రవారం ఉదయం ఢిల్లీలోని సాకేత్ కోర్టు వద్ద కాల్పులు జరపడంతో ఒక మహిళతో సహా కనీసం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాజస్థాన్ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బుధవారం కనీసం రూ. 800 కోట్ల బొగ్గు చోరీకి పాల్పడిన వ్యవస్థీకృత రాకెట్‌ను ఛేదించింది.ఈ ముఠా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అధిక క్యాలరీ విలువ కలిగిన బొగ్గు స్థానంలో నాణ్యమైన బొగ్గును ఉపయోగించేదని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) దినేష్ తెలిపారు.
హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేణు భాటియా గురువారం ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కైతాల్‌లోని ఆర్కెఎస్డి కళాశాలలో చట్టం మరియు సైబర్‌క్రైమ్‌పై అవగాహన కార్యక్రమంలో భాటియా తన ప్రసంగంలో అమ్మాయిల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లోని తన క్యాంపస్‌లోని 1.38 ఎకరాల లీజు భూమిలో 13 డెసిమల్స్ భూమిని మే 6 లోగా ఖాళీ చేయాలని విశ్వభారతి యూనివర్శిటీ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కు నోటీసులు పంపింది.
తాను చదువుతున్న పాఠశాలలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ఒక బాలిక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరడంతో పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ పనులు ప్రారంభించింది.సీరత్ నాజ్ అనే 3వ తరగతి చదువుతున్న బాలిక పాఠశాల శిథిలావస్థలో ఉన్న తన పాఠశాల పరిస్థితిని పరిష్కరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ వీడియోను రికార్డ్ చేసింది.
2019 పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని, సస్పెండ్ చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ చేసిన అప్పీల్‌ను సూరత్ సెషన్స్ కోర్టు గురువారం తోసిపుచ్చింది.
భారతీయ సైన్యం సిబ్బందికి చైనీస్ భాషలో శిక్షణ ఇవ్వడం కోసం బుధవారం భారత సైన్యం మరియు తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. ఇటీవల కాలంలో చైనా సరిహద్దులో ఎదురవుతున్న సవాళ్ల నేపధ్యంలో ఈ భాషను నేర్చుకోవడం సైనిక సిబ్బందికి ఉపయోగపడుతుందని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.
నేషనల్ క్వాంటం మిషన్ (NQM)కి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది, క్వాంటం టెక్నాలజీలలో పరిశోధన మరియు అభివృద్ధిలో పాల్గొన్న మొదటి ఆరు ప్రముఖ దేశాలలో భారతదేశాన్ని చేర్చింది.