Home / latest national news
కర్ణాటకలో కాంగ్రెస్ ఘనవిజయం నమోదు చేసిన తర్వాత, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని నియమించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు పార్టీ ఆదివారం ముగ్గురు పరిశీలకులను నియమించింది. ప్రభుత్వ ఏర్పాటు, రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిపై చర్చించేందుకు బెంగళూరులో కాంగ్రెస్ నేడు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
శనివారం సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ, సీబీఐ డైరెక్టర్ పదవికి ముగ్గురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసింది.క్యాబినెట్ నియామకాల కమిటీకి పంపబడిన షార్ట్‌లిస్ట్ చేసిన పేర్లలో ప్రవీణ్ సూద్.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కర్ణాటక, సుధీర్ కుమార్ సక్సేనా.. డీజీపీ, మధ్యప్రదేశ్, మరియు తాజ్ హసన్ ..డైరెక్టర్ జనరల్, ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ మరియు హోంగార్డ్స్ ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. మొత్తం 17 మున్సిపల్ కార్పోరేషన్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 17 మేయర్లు మరియు 1,401 కార్పొరేటర్లను ఎన్నుకోవడానికి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు మే 4 మరియు మే 11 తేదీలలో రెండు దశల్లో జరిగాయి.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( ఎన్ సి ఆర్ బి), భారత నావికాదళం సంయుక్తంగా జరిపిన దాడిలో శనివారం కేరళ తీరంలో రూ. 15,000 కోట్ల విలువైన 2,500 కిలోల మెథాంఫేటమిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నాయి.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయంతో దేశరాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాయలం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రంగంలోకి పలు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించినప్పటికీ బీజేపీ పరాజయాన్ని ఆపలేకపోయారు
కర్ణాటకలో జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పర్యటించిన జిల్లాల్లో మెజారిటీ అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు తమ నేత సాగించిన ప్రచారం కూడా తమకు ఆయా జిల్లాల్లో కలిసి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమైనట్లే. ఈ నేపధ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా చర్చ మొదలయింది. మాజీ సీఎంసిద్ధరామయ్య మరియు పీసీసీ చీఫ్ డికె శివకుమార్‌ల మధ్య సీఎం సీటుకోసం పోటీ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే
Karnataka Election Result: కర్ణాటక రాష్ట్రంలో ఫలితాలపై ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తుంది.
పశ్చిమ బెంగాల్లో సినిమాపై నిషేధం, తమిళనాడులో డిఫాక్టో నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ 'ది కేరళ స్టోరీ' నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఈ నెల 8న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో ఈ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా తమిళనాడు మల్టీప్లెక్స్ యజమానులు ఈ సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నారు.