Home / latest national news
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారు.మీరు ఎల్లప్పుడూ నాపై ప్రేమ మరియు ఆప్యాయతలతో ముంచెత్తారు. ఇది నాకు దైవిక ఆశీర్వాదంగా అనిపిస్తుందని ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.
నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అణచివేతలో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. చెన్నై, దిండిగల్, మదురై, తేనిలో సోదాలు కొనసాగుతున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీఖండి నుండి ఇండోర్ వెళ్తున్న బస్సు బోరాడ్ నది వంతెన రెయిలింగ్ ను ఢీకొని నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. ఆ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణీకులున్నారని సమాచారం అందుతుంది. రాష్ట్రంలోని ఖార్గోన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
: ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఫండ్ (PM CARES ఫండ్) గత మూడేళ్లలో విదేశీ విరాళాలుగా రూ. 535.44 కోట్లు అందుకుంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో PM CARES ఫండ్ 2020లో ఏర్పాటు చేయబడింది.
మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయడంపై సుప్రీంకోర్టు సోమవారం బీహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు పడిన ఆనంద్ మోహన్, బీహార్ జైలు నిబంధనల సవరణతో గత నెలలో సహర్సా జైలు నుంచి బయటకు వచ్చారు.
కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం లేదా సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదు అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్బంగా శనివారం జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు.
మణిపుర్లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ద్వారా మణిపుర్ రాజధాని ఇంఫాల్ నుంచి విద్యార్థులను శంషాబాద్ తీసుకొచ్చారు.
రిజర్వేషన్ల కారణంగా హింసాత్మక ఘటనలు రేగిన మణిపూర్ నుండి వందలాది మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ నేపధ్యంలో ప్రయాణీకుల డిమాండ్ పెరిగిపోవడంతో ఇండిగో మరియు ఎయిర్ ఏషియాతో సహా పలు విమానయాన సంస్థలు తమ ఛార్జీలను పెంచాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో డీఆర్జీ జవాన్లు, నక్సల్స్ మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తరలించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు హెల్ప్లైన్లను ఏర్పాటు చేశాయి. మణిపూర్ ప్రభుత్వంతో ఏపీ, తెలంగాణ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు.