Home / latest national news
పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వరుస పేలుళ్లలతో ఆ ప్రాంతమంతా తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. కాగా తాజాగా గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటన అక్కడి స్థానికి ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. లంగర్ హాల్ ఎదురుగా ఉన్న శ్రీగురు రామ్ దాస్ జీ సరాయ్ వద్ద బుధవారం అర్థరాత్రి ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
ఢిల్లీలో పని చేస్తున్న రోజువారీ కూలీ అయిన రవీందర్ కుమార్‌కి ప్రతి రాత్రి చిన్న పిల్లల కోసం గంటల తరబడి వేటాడటం దినచర్యగా మారింది. వారిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన తరువాత చంపేసే వాడు. ఇటువంటి వారిని గుర్తిండానికి అతను ఢిల్లీలోని మురికివాడల గుండా మైళ్ళ దూరం నడిచేవాడు.
ఎన్నికల తర్వాత జనతాదళ్ (సెక్యులర్)తో పొత్తు ఉండదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ స్ఫష్టం చేసారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడిఎస్‌తో పొత్తుకు అవకాశాలు లేవు. మేము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 130-135 సీట్లు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికూర్జున్ ఖర్గే కూడా ప్రకటించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా 2,165 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 31 లక్షల 33 వేల 54 మంది ఓటర్లు ఉన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు వందలాది కోట్లు ఖర్చు చేస్తున్నాయి. మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నాయి. కొందరికి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నాయి.
మంగళవారం తెల్లవారుజామున ఒడిశాలోని కలహండి జిల్లాలో రాష్ట్ర నిఘా విభాగం (ఎస్‌ఐడబ్ల్యూ) భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించగా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ర్యాంక్ అధికారి గాయపడ్డారు.
దక్షిణాఫ్రికా నుండి తీసుకువచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఉంచిన ఆడ చిరుత, దక్ష, పార్క్‌లోని ఇతర చిరుతలతో జరిగిన పోరాటంలో చనిపోయింది . దక్షిణాఫ్రికా మరియు నమీబియా నుండి పిల్లులను తీసుకువచ్చిన తరువాత కునోలో మరణించిన మూడవ చిరుత ఇది.
కేడర్ మరియు నియామకంతో సంబంధం లేకుండా బ్రిగేడియర్ ర్యాంక్ మరియు అంతకంటే ఎక్కువ ఉన్న అధికారులకు కామన్ యూనిఫాం కలిగి ఉండాలని సైన్యం నిర్ణయించింది, ఇది దళం యొక్క సీనియర్ నాయకత్వంలో సేవా విషయాలలో ఉమ్మడి గుర్తింపు మరియు విధానాన్ని ప్రోత్సహించడానికి మరియు బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది.
రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అవినీతి సమస్యలను లేవనెత్తడానికి మే 11న అజ్మీర్ నుండి జైపూర్ వరకు 'జన్ సంఘర్ష్ యాత్ర'ను మంగళవారం ప్రకటించారు. ఈ సందర్బంగా పైలట్ మాట్లాడుతూ ధోల్పూర్లో అశోక్ గెహ్లాట్ ప్రసంగం విన్న తర్వాత ఆయన నాయకురాలు సోనియా గాంధీ కాదని, వసుంధర రాజే అని అనిపిస్తోందని అన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎమ్మెల్యే జితేంద్ర అవద్ మంగళవారం ఇటీవల విడుదలైన 'ది కేరళ స్టోరీ' సినిమా నిర్మాతలపై విరుచుకుపడ్డారు,.నిర్మాతను బహిరంగంగా ఉరితీయాలని కూడా పిలుపునిచ్చారు.