Home / latest national news
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని నిర్మించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తిచేసుకునే సమయంలో కొత్త పార్లమెంటు భవనాన్ని ఈ నెలాఖరులో ప్రారంభిస్తారని సమాచారం.
'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు "అడివి శేష్". 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్. ఆ మూవీ లో అడవి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.
రోజ్‌గార్ మేళా కింద, ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మంగళవారం కొత్తగా చేరిన వారికి దాదాపు 71,000 అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేసిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క ప్రతి పథకం మరియు ప్రతి విధానం యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని అన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు ఇవాళ సమన్లు జారీ చేసింది. 100 కోట్ల పరువు నష్టం కేసులో జులై 10 న న్యాయస్థానం ముందు హాజరు కావాలని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు పంపింది.
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడింది. సిఎం పదవి కావాలంటూ కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్, మాజీ సిఎం సిద్ధ రామయ్య పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మాజీ సిఎం సిద్ధరామయ్య కాసేపట్లో రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తన కొడుకు ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో రక్షించడానికి రూ. 25 కోట్లు ఇవ్వాలని ఎన్‌సిబి అధికారులు బెదిరించారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
దుబాయ్-అమృత్సర్ విమానంలో మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడినందుకు ఓ మగ ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.పంజాబ్‌లోని జలంధర్‌లోని కోట్లి గ్రామానికి చెందిన రాజిందర్ సింగ్, ఎయిర్ హోస్టెస్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగి శనివారం ఆమెను వేధించాడని పోలీసులు తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొత్త సీఎం ఎంపికలో కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది, ఆ రాష్ట్ర పీసీపీ చీఫ్ డికె శివకుమార్ మరియు సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య ఇద్దరూ ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశిస్తున్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో కల్తీ మద్యం సేవించి 13 మంది మృతి చెందగా, పలువురు ఆస్పత్రి పాలయ్యారు. విల్లుపురం జిల్లా మరక్కానంలో తొమ్మిది మంది, చెంగల్పట్టు జిల్లా మదురాంతకం వద్ద కల్తీ మద్యం సేవించి నలుగురు మృతి చెందారు.
రక్షణ తయారీ రంగంలో స్వయం సమృద్దికోసం డిసెంబర్ 2023 మరియు డిసెంబర్ 2029 మధ్య దశలవారీగా దిగుమతి నిషేధం కిందకు వచ్చే లైన్ రీప్లేస్మెంట్ యూనిట్లు, సబ్-సిస్టమ్‌లు మరియు విడిభాగాలతో సహా 928 సైనిక వస్తువుల తాజా జాబితాను భారతదేశం ప్రకటించింది.