Last Updated:

Cabinet Meeting : రేపు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం

Cabinet Meeting : రేపు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం

Cabinet Meeting : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు (సోమవారం) కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులుకు మంత్రివర్గం ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం.

 

ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన 10 సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. పది సంస్థలు ఏపీలో పెట్టనున్న రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు సోమవారం ఆమోదం తెలుపనున్నట్లు తెలుస్తోంది. లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖలో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో నిర్మించే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇంకా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: