Last Updated:

CBI Director: సీబీఐ డైరక్టర్ పదవికి ముగ్గురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిన కమిటీ

శనివారం సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ, సీబీఐ డైరెక్టర్ పదవికి ముగ్గురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసింది.క్యాబినెట్ నియామకాల కమిటీకి పంపబడిన షార్ట్‌లిస్ట్ చేసిన పేర్లలో ప్రవీణ్ సూద్.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కర్ణాటక, సుధీర్ కుమార్ సక్సేనా.. డీజీపీ, మధ్యప్రదేశ్, మరియు తాజ్ హసన్ ..డైరెక్టర్ జనరల్, ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ మరియు హోంగార్డ్స్ ఉన్నారు.

CBI Director: సీబీఐ డైరక్టర్ పదవికి ముగ్గురి పేర్లను  షార్ట్‌లిస్ట్ చేసిన కమిటీ

CBI Director: శనివారం సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ, సీబీఐ డైరెక్టర్ పదవికి ముగ్గురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసింది.క్యాబినెట్ నియామకాల కమిటీకి పంపబడిన షార్ట్‌లిస్ట్ చేసిన పేర్లలో ప్రవీణ్ సూద్.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కర్ణాటక, సుధీర్ కుమార్ సక్సేనా.. డీజీపీ, మధ్యప్రదేశ్, మరియు తాజ్ హసన్ ..డైరెక్టర్ జనరల్, ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ మరియు హోంగార్డ్స్ ఉన్నారు.

అధీర్ రంజన్ చౌదరి అభ్యంతరం.. (CBI Director)

శనివారం ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగిన ప్రత్యేక ప్యానెల్ సమావేశంలో ఈ సమావేశంలో, కొత్త సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా మరియు సభ్యుడు లోక్‌పాల్‌గా నియామకానికి అవకాశం ఉన్న అభ్యర్థుల గురించి కూడా చర్చించారు.సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సివిసి) ఎంపికపై లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్  ఇంతకుముందు సీబీఐ చీఫ్ పదవికి దాదాపు 115 పేర్ల జాబితాను పంపింది. జాబితాలోని అధికారుల సేవా రికార్డులు, వ్యక్తిగత వివరాలు మరియు సమగ్రత పత్రాలు తనకు అందలేదని చౌదరి చెప్పినట్లు సమాచారం.

రేసులో ముందున్న కర్ణాటక డీజీపీ..

సీబీఐ చీఫ్ రేసులో కర్ణాటక డీజీపీ ముందున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్ర కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ ఈ పదవికి ముందంజలో ఉన్నట్లు సమాచారం. మార్చిలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని రక్షిస్తున్నారని ఆరోపించినప్పుడు సూద్ వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని అరెస్టు చేయాలని శివకుమార్ కోరారు.