Home / latest national news
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (మే 19) తన ఆరు రోజుల పర్యటన కోసం మూడు దేశాలైన జపాన్, పాపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియాకు బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనడానికి బయలుదేరారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి గురువారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) ముందు ఉద్యోగాల భూములు కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు.ఈడీ ఉదయం రెండున్నర గంటలపాటు రబ్రీదేవి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆమె మళ్లీ భోజన విరామం తరువాత విచారణకు హాజరయ్యారు.
ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది మరియు భద్రతా కారణాల దృష్ట్యా సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని థియేటర్ యజమానులు నిర్ణయించడంతో సినిమా ప్రేక్షకులకు భద్రత కల్పించాలని తమిళనాడును కోరింది.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఒడిశాలో మొదటి వందే భారత్ రైలును (పూరీ-హౌరా)వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఇది పశ్చిమ బెంగాల్లో ప్రయాణించే రెండవ వందే భారత్ రైలు కావడం విశేషం.
తమిళనాడు, మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రభుత్వాలకు పెద్ద ఊరటగా, ఎద్దులను మచ్చిక చేసుకునే సంప్రదాయ క్రీడ జల్లికట్టు' మరియు ఎద్దుల బండి పందేల చెల్లుబాటును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది.
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటక సీఎం పోస్టు కోసం రేసులో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సిద్ధరామయ్య పోటీ పడుతున్నారు.
ముంబై యొక్క వడ పావ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తాజాగా భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తాను తొలిసారి మహారాష్ట్రలో పర్యటిస్తున్న సందర్బంగా ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే తనకు వడపావ్ వడ్డించి తినేలా చేసారని వ్యాఖ్యానించారు.
తనకు కొడుకు కావాలని అందువలన జైలులో ఉన్న తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలంటూ మధ్యప్రదేశ్ కు చెందిన ఒక మహిళ అధికారులను అభ్యర్దించింది. గత ఏడేళ్లుగా గ్వాలియర్ సెంట్రల్ జైలులో ఉన్న భర్త పెరోల్ కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది.
నిషేధిత వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సభ్యుడు జస్వీందర్ సింగ్ ముల్తానీ సహచరుల ప్రాంగణాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
కర్నాటక విజయంతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం ఉరకలేస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఏకమై మోదీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నాయి. వచ్చే ఏడాది మే నెలలోనే దేశ ప్రజలు కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిఉంటుంది.