New Parliament Building: ఈ నెలాఖరులో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని నిర్మించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తిచేసుకునే సమయంలో కొత్త పార్లమెంటు భవనాన్ని ఈ నెలాఖరులో ప్రారంభిస్తారని సమాచారం.
New Parliament Building: ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని నిర్మించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తిచేసుకునే సమయంలో కొత్త పార్లమెంటు భవనాన్ని ఈ నెలాఖరులో ప్రారంభిస్తారని సమాచారం.
దేశ ఆకాంక్షలను నెరవేరుస్తుంది..(New Parliament Building)
నెల రోజుల క్రితం ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలసి మోదీ కాంప్లెక్స్‌లో గంటకు పైగా గడిపి వివిధ పనులను పరిశీలించారు. పార్లమెంటు ఉభయ సభల సంబంధించిన నిర్మాణాలు, సౌకర్యాలను ప్రధాని గమనించారు. అనంతరం నిర్మాణ కార్మికులు మరియు అధికారులతో సంభాషించారు.
ప్రధానమంత్రి 2020లో కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. సెప్టెంబర్ 2021లో, కొత్త కాంప్లెక్స్ ఉన్న ప్రదేశాన్ని సందర్శించి అక్కడ ఉన్న కార్మికులతో సంభాషించారు.
శంకుస్థాపన చేసిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ. కొత్త పార్లమెంటు భవనం అవసరం చాలా ఏళ్లుగా ఉంది. 21వ శతాబ్దపు భారతదేశానికి కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ అవసరం. పాత భవనం దేశ అవసరాలను తీర్చితే, కొత్త పార్లమెంటు భవనం దేశ ఆకాంక్షలను నెరవేరుస్తుందని అన్నారు.
భవన నిర్మాణ వ్యయం రూ.971 కోట్లు..
కొత్త పార్లమెంట్ భవన సముదాయం 64,500 చదరపు మీటర్లు మరియు రూ.20,000 కోట్ల విలువైన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగం. పార్లమెంటు భవన నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.971 కోట్లుగా అంచనా వేయబడింది. ఈ భవనం భూకంపాలను తట్టుకోగలదుకొత్త పార్లమెంటు భవనంలో దాదాపు 1,200 మంది ఎంపీలు ఉండేలా దీనిని నిర్మించారు.టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించింది. పార్లమెంటు సభ్యుల కోసం లాంజ్, లైబ్రరీ, బహుళ కమిటీ గదులు, డైనింగ్ హాల్స్ మరియు విస్తారమైన పార్కింగ్ స్థలాన్ని కలిగి ఉంటుంది. ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి అసలు గడువు గతేడాది నవంబర్‌తో ముగిసింది.