Home / Latest Natiional News
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న సందర్భంగా బుధవారం రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ర్యాలీలో ప్రసంగించే ముందు ఆయన పుష్కర్ లోని బ్రహ్మ దేవాలయంలో పూజలు చేసి ఘాట్లను సందర్శించారు.
మణిపూర్‌కు చెందిన పదకొండు మంది క్రీడా ప్రముఖుల బృందం రాష్ట్రంలోని ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ హోం మంత్రి అమిత్ షాకు లేఖ పంపింది. సంతకం చేసిన వారిలో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను కూడా ఉన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లను అక్కడనుంచి పంపించిన నేపధ్యంలో వారు మంగళవారం తమ మెడల్స్ ను హరిద్వార్ లోని గంగానదిలో నిమజ్జనం చేస్తామని తెలిపారు. ట్విట్టర్ లో పోస్టు చేసిన ఈ ప్రకటనలో పతకాలను నిమజ్జనం చేసిన తరువాత ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహారదీక్షకు కూర్చుటుంటామని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌహతి నుండి న్యూ జల్పాయ్ గురిని కలుపుతూ అస్సాం యొక్క మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ రైలు సుమారు 5 గంటల 30 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకుంటుంది
చిరుత పునరుద్ధరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించడానికి మరియు పర్యవేక్షించడానికి ప్రభుత్వం 11 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్యానెల్ చిరుత ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షిస్తుంది మరియు పర్యావరణ-పర్యాటకానికి చిరుత నివాసస్థలాలకు అనుమతించడంపై సూచనలను అందిస్తుంది.
Delhi CM: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఈ మేరకు శనివారం ఆయన హైదరాబాద్ రానున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
Bihar: విద్యార్ధులకు మంచిబుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. విపరీత చర్యకు దిగారు. వారి ఎదుటే.. చెప్పులతో ఇష్టానుసారంగా దాడి చేసుకున్నారు.
:ఢిల్లీ (ఆనంద్ విహార్)-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లో ప్రవేశపెట్టిన తొలి వందే భారత్ రైలు ఇది కావడం విశేషం.
జ్ఞానవాపి వివాదానికి సంబంధించిన మొత్తం ఏడు కేసులను కలిపి విచారిస్తామని వారణాసి జిల్లా కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. సోమవారం విచారణ ముగియడంతో తీర్పును రిజర్వ్‌లో ఉంచిన జిల్లా న్యాయమూర్తి ఈరోజు తన తీర్పులో సంబంధిత ఏడు కేసులను కలిపి విచారించనున్నట్లు తెలిపారు.
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లోని పీడియాట్రిక్ సర్జరీ విభాగం మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారికి లాపరోస్కోపిక్ పైలోప్లాస్టీని నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పింది.