Last Updated:

Delhi CM: హైదరాబాద్‌కు రానున్న దిల్లీ సీఎం.. రేపు కేసీఆర్‌తో భేటీ కానున్న కేజ్రీవాల్

Delhi CM: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఈ మేరకు శనివారం ఆయన హైదరాబాద్ రానున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

Delhi CM: హైదరాబాద్‌కు రానున్న దిల్లీ సీఎం.. రేపు కేసీఆర్‌తో భేటీ కానున్న కేజ్రీవాల్

Delhi CM: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఈ మేరకు శనివారం ఆయన హైదరాబాద్ రానున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. దీంతో ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఈ సమావేశంలో కేంద్ర ఆర్డినెన్స్ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ కు దిల్లీ సీఎం.. (Delhi CM)

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఈ మేరకు శనివారం ఆయన హైదరాబాద్ రానున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. దీంతో ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఈ సమావేశంలో కేంద్ర ఆర్డినెన్స్ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై దిల్లీ సీఎం కేజ్రీవాల్ పోరాటం చేస్తున్నారు. దీనికి విప‌క్షాల మ‌ద్ద‌తు కూడ‌గట్టేందుకు.. సీఎం కేసీఆర్ ను కలవనున్నారు.

దేశ రాజధాని పరిధి దిల్లీలో గ్రూప్‌ ఏ అధికారుల బదిలీల విషయంలో కేంద్రం ఓ ప్రత్యేక ఆర్డినెన్స్ ను జారీ చేసింది.

దీని ద్వారా.. సంబంధిత ఉద్యోగుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఓ అథారిటీని ఏర్పాటు చేసింది.

దీనికి చైర్మన్ గా దిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.

ఈ అథారిటీ ప్రకారం బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు.

అయితే ఇదే విషయంలో దిల్లీ సీఎం అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగుల విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వానిదే అధికారం అని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును అమలు చేయాలని.. దిల్లీ సీఎంతో పాటు మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.

సుప్రీంకోర్టు తీర్పును ఆర్డినెన్స్‌ ద్వారా అడ్డుకునే ప్రయత్నం కేంద్రం చేస్తుందని కేజ్రీవాల్‌ ట్వీట్‌ కూడా చేశారు.

ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్‌ పలువురు నేతలను కలిశారు. ఈ క్రమంలోనే శనివారం సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు.

నీతి ఆయోగ్‌ భేటీకి కేజ్రీవాల్‌ డుమ్మా..

శనివారం జరిగే.. నీతి అయోగ్ భేటీని కేజ్రీవాల్ బహిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మోదీకి లేఖ రాశారు.

సహకార సమాఖ్య అనేది అపహాస్యం అవుతున్న వేళ.. నీతి ఆయోగ్‌ భేటీ వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.

కాగా.. ఇప్పటికే నీతి ఆయోగ్‌ భేటీని సీఎంలు మమత బెనర్జీ, భగవంత్‌ మాన్‌ బహిష్కరించారు.