Home / latest ap news
తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో రెండు తెలుగు రాష్ట్రాలు మార్మోగుతున్నారు. దూపదీప నైవేధ్యాలు, భజనలతో శివాలయాలు కళకళలాడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పలు రాష్ట్రాల్లోనూ మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉండే కోటప్పకొండ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కోటప్పకొండ సమీపంలోని గ్రామాలకు చెందిన వారు.. ప్రభలు కట్టుకుని కొండకు వెళ్లి శివయ్యను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
Gang Rape In Konaseema : కామంతో కళ్ళు మూసుకుపోతున్న మృగాళ్లు ఆడవారిపై హింసాకాండను కొనసాగిస్తూనే ఉంటున్నారు. చిన్నా, పెద్ద తారతమ్యాలను మరచిపోతూ.. వావివరసాలను సైతం గాలి కొదిలేస్తూ పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనలకు ముగింపు ఎప్పుదు వస్తుందా అని భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు ఆడవారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి […]
రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా లింగరాజుపాలెం కస్తుర్భా పాఠశాల విద్యార్థినుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరితో కన్నీరు పెట్టిస్తోంది. మంచిగా చదువు చెబుతారని ఇక్కడ చేరామని.. కానీ ఆ పరిస్థితి లేదంటూ బాలికలు కన్నీటి పర్యంతం అయ్యారు.
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీని వీడిన కన్నా దారెటు అనే ప్రశ్నకు బలంగా వినిపిస్తున్న పేరు టీడీపీ.
గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్ ప్రెస్ మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో సుమారు 6 బోగీలు పట్టాలు తప్పాయి అని సమాచారం అందుతుంది.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా రిటైర్డ్ సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ప్రస్తుత ఏపీ గవర్నర్గా ఉన్న బిస్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియామకం అయ్యారు.
మహా శివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం పుణ్య క్షేత్రం సిద్దమైంది. ఈ మేరకు శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. ఈ రెండు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.