Tirumala Rush: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 30 గంటల పైనే
టీటీడీ నివారణ చర్యలకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం లోపు భక్తుల రద్దీ తగ్గక పోతే క్యూలెన్లో ఎంట్రీ నిలిపి వేయనున్నారు.
Tirumala Rush: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో భక్తులు రద్దీ ఒక్కసారిగా పెరిగింది. మూడు రోజుల వరుస సెలవులు రావడంతో భక్తులు రద్దీ ఎక్కువైంది. సర్వదర్శనం టోకెన్లు తీసుకోకుండా ఇప్పటికే భక్తులు తిరుమలకు చేరుకున్నారు. అయితే టోకెన్లు లేకుండా భక్తులతో వైకుంఠం క్యాకాంపెక్స్ 2 లోని కంపార్ట్ మెంట్లు, నారాయణ గిరి షెడ్లు నిండిపోయాయి. దీంతో క్యూలైన్లు గోగర్భం జలాశయం వరకు చేరుకున్నాయి.
నిండిపోయిన కంపార్ట్ మెంట్లు
మరో వైపు శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పైనే పడుతోంది. దీంతో టీటీడీ నివారణ చర్యలకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం లోపు భక్తుల రద్దీ తగ్గక పోతే క్యూలెన్లో ఎంట్రీ నిలిపి వేయనున్నారు. తిరిగి శనివారం ఉదయం నుంచి అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పెరిగిన భక్తుల రద్దీపై టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లు భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలను అందజేస్తున్నారు.