Home / Kerala Governor
విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి నుండి గవర్నర్‌ను తొలగించడానికి రాష్ట్ర అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఛాన్సలర్ స్థానంలో నిపుణుడిని తీసుకురావాలని ఆలోచిస్తోంది.
కేరళలో ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య దూరం మరింత పెరుగుతోంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు, పినరయి విజయన్ సర్కారు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వీసీల నియామకం విషయంలో గవర్నర్, సర్కారుకు మధ్య నెలకొన్న వివాదం మరో మలుపు తీసుకుంది.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ 11 యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనకు రాజీనామా లేఖలు పంపేందుకు నిరాకరించడంతో టూ తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని గవర్నర్ గతంలో కోరారు.