Home / Kazakhstan
Azerbaijan Airlines Plane Crashes Near Aktau City In Kazakhstan: కజికిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో ఉండగా ఓ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 65 మందికిపైగా మరణించినట్లు సమాచారం. వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం అక్టౌ ప్రాంతానికి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 72 మంది ఉన్నట్లు […]
ఆయనొక ప్రజా ప్రతినిధి.. మాజీ మంత్రి కూడా.. అయితే ఏం లాభం...సొంత భార్యను కొట్టి కొట్టి చంపాడు. ఒళ్లు జలదరించే ఈ ఘటన కజకిస్తాన్‌లో జరిగింది. గత ఏడాది నవంబర్‌లో తన భర్తకు చెందిన బంధువు రెస్టారెంట్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేరు కుయాండిక్ బిషింబాయేవ్. కాగా ఆయన భార్య పేరు సాల్తానాట్ నుకెనోవా.
కజకిస్తాన్‌లోని అతిపెద్ద నగరం అల్మాటీలోని హాస్టల్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది మరణించినట్లు నగరంలోని అత్యవసర విభాగం ఒక ప్రకటనలోతెలిపింది.మృతుల్లో తొమ్మిది మంది కజకిస్థాన్ కు చెందిన వారు కాగా , ఇద్దరు వ్యక్తులు రష్యా, ఇద్దరు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వారని అల్మాటీ పోలీసు విభాగం తెలిపింది.
కజకిస్థాన్‌లో ఆర్సెలర్‌మిట్టల్‌కు చెందిన బొగ్గు గనిలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారుగా 32 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు.కోస్టియెంకో గనిలో సాయంత్రం 4 గంటలకు (1000 GMT) 32 మంది మృతదేహాలు కనుగొనబడ్డాయి. 14 మంది మైనర్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది అని అత్యవసర పరిస్దితుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కజకిస్థాన్ కు చెందిన ఎలీనా రైబాకినా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరడం ఆమెకు ఇదే తొలిసారి కాగా, అద్భుతమైన ఆటతీరుతో ట్యునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్ ను ఓడించింది.