Last Updated:

Kazakhstan: కజకిస్థాన్ బొగ్గు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 32 మంది మృతి.. పలువురు గల్లంతు

కజకిస్థాన్‌లో ఆర్సెలర్‌మిట్టల్‌కు చెందిన బొగ్గు గనిలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారుగా 32 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు.కోస్టియెంకో గనిలో సాయంత్రం 4 గంటలకు (1000 GMT) 32 మంది మృతదేహాలు కనుగొనబడ్డాయి. 14 మంది మైనర్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది అని అత్యవసర పరిస్దితుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Kazakhstan: కజకిస్థాన్ బొగ్గు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో  32 మంది మృతి.. పలువురు గల్లంతు

Kazakhstan: కజకిస్థాన్‌లో ఆర్సెలర్‌మిట్టల్‌కు చెందిన బొగ్గు గనిలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారుగా 32 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు.కోస్టియెంకో గనిలో సాయంత్రం 4 గంటలకు (1000 GMT) 32 మంది మృతదేహాలు కనుగొనబడ్డాయి. 14 మంది మైనర్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది అని అత్యవసర పరిస్దితుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మంటలు చెలరేగిన సమయంలో కోస్టియెంకో బొగ్గు గనిలో దాదాపు 252 మంది పనిచేస్తున్నారని లక్సెంబర్గ్‌కు చెందిన స్థానిక యూనిట్ ఆపరేటర్ ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ తెలిపారు.మిథేన్ గ్యాస్ వల్ల మంటలు చెలరేగాయని కంపెనీ తెలిపింది. మరణించిన, గాయపడిన ఉద్యోగులు కుటుంబాలకు సహాయం, పునరావాసం పై దృష్టి పెడతామని తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ కరాగండా ప్రాంతంలో ఎనిమిది బొగ్గు గనులను, మధ్య మరియు ఉత్తర కజకిస్తాన్‌లో మరో నాలుగు ఇనుప ఖనిజం గనులను నిర్వహిస్తోంది.

తరచుగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు..(Kazakhstan)

కజకిస్తాన్‌లోని సంస్థ నిర్వహించే సైట్‌లలో అగ్నిప్రమాదం అనేది సాధారణంగా మారింది. భద్రత మరియు పర్యావరణ నిబంధనలను గౌరవించడంలో కంపెనీ విఫలమైందని ఆరోపణలు ఉన్నాయి.ఆగస్టులో, అదే గనిలో మంటలు చెలరేగడంతో నలుగురు మైనర్లు మరణించారు, నవంబర్ 2022 లో మరొక ప్రదేశంలో మీథేన్ లీక్ కారణంగా ఐదుగురు మరణించారు.2006లో ఆర్సెలర్‌మిట్టల్‌లో 41 మంది మైనర్లు మరణించిన తర్వాత అక్టోబర్ 27న జరిగిన అగ్నిప్రమాదం కజకిస్తాన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన మైనింగ్ ప్రమాదం గా చెప్పవచ్చు.