Home / kaikala satyanarayana
కళామ్మతల్లి ముద్దుబిడ్డ, సినీనటుడు కైకాల సత్యనారాయణ మృతి తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.
తెలుగు సినిమా ఓ దిగ్గజ నటుడిని కోల్పోయింది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ ఎన్ని పాత్రలు చేసినా కైకాల అంటే ప్రధానంగా గుర్తొచ్చేది యముడి పాత్రే.
నవరస నటనాసార్వభౌముడిగా ఎన్నో వందల సినిమాలతో ప్రజలను మెప్పించిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ. కేజీఎఫ్ సినిమా రిలీజ్ సమయంలోనే ఆ చిత్ర బృందం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కైకాల సత్యనారాయణ పాల్గొని.. హీరో యశ్ గురించి ప్రస్థావించారు.
నటసార్వభౌమడు, మచిలీపట్నం మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ అకాల మృతితో ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కైకాల మృతి పట్ల టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. కైకలతో తనకున్న అనుబంధం ఎంతో మధురమైనదని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలుగు సినీ పరిశ్రమకు ఓయనో కలికాల యముడు, ఆయన ఓ ఘటోత్కచుడు.. యముండ అన్నాడంటే టక్కున గుర్తొచ్చేది కైకాల సత్యనారాయణే. తన గంభీరమైన సర్వంతో నటనకే కొత్త నడకలు నేర్పిన నవరస నట సార్వభౌముడిగా ఆయన.