Last Updated:

కైకాల సత్యనారాయణ: చిరంజీవి, కైకాల సత్యనారాయణది “ఉప్ప చేప పప్పుచారు బంధం” అని ఎందుకు అంటారు..?

కైకాల మృతి పట్ల టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. కైకలతో తనకున్న అనుబంధం ఎంతో మధురమైనదని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కైకాల సత్యనారాయణ: చిరంజీవి, కైకాల సత్యనారాయణది “ఉప్ప చేప పప్పుచారు బంధం” అని ఎందుకు అంటారు..?

Kaikala Satyanarayana: సినీప్రపంచంలో మరో విషాదం నెలకొంది. కళామ్మ తల్లి ముద్దు బిడ్డ, దిగ్గజ నటుడు కైకాల స‌త్యనారాయణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచేసింది. వందలాది సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించి అశేష ప్రేక్షకులను మెప్పించారు కైకాల సత్యనారాయణ. కాగా గత కొంత కాలంగా వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఆయన. సుమారు 777 సినిమాల్లో నటించిన కైకాల గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణ భౌతికదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.

Image

కాగా కైకాల మృతి పట్ల టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. కైకలతో తనకున్న అనుబంధం ఎంతో మధురమైనదని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యన్నారాయణ మృతి చెందడం నన్ను కలచివేస్తోందంటూ ట్విట్టర్ వేదికగా చిరు ట్వీట్ చేశారు.

కైకాల సత్యన్నారాయణ, తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో వేరే ఏ నటుడు పోషించి ఉండరు అంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. సత్యనారాయణతో కలిసి తాను ఎన్నో చిత్రాల్లో నటించానని ఆ సందర్భాల్లో ఆయన నటనలోని వేరియేషన్లను మరియు ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి చూడగలిగే అవకాశం కలిగిందని చిరంజీవి తెలిపారు. గొప్ప స్పాంటేనిటీ ఉన్న అరుదైన నటుల్లో సత్యనారాయణ ఒకరు అని తెలిపారు. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేకమైన స్టైల్. నిష్కల్మషమైన మనసున్న వ్యక్తి.. స్వచ్ఛమైన స్పటికం లాంటి మనిషి.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ముక్కుసూటి స్వభావం కలవారు సత్యనారాయణ అంటూ తనతోని అనుభవాల గురించి మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

Image

సత్యనారాయణ నన్ను ఎప్పుడూ ‘తమ్ముడూ’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారని, మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయని ఆయన చెప్పారు. సత్యనారాయణతో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, మరెన్నో ఆనందకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. నటన, రుచికరమైన భోజనం రెండూ కైకాల సత్యన్నారాయణకి ప్రాణమని చిరంజీవి తెలిపారు. తన శ్రీమతి సురేఖ చేతివంటను కైకాల ఎంతో ఇష్టపడేవారని.. గత రెండేళ్లుగా కైకాల జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని మెగాస్టార్ అన్నారు. ఆ సందర్భంలో సత్యన్నారాయణ తన భార్య సురేఖతో “అమ్మా ఉప్పు చేప వండి పంపించు” అని అన్నప్పుడు “మీరు త్వరగా కోలుకోండి.. ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం” అని తాము చెప్పామని మెగాస్టార్ తెలిపారు. ఆ క్షణంలో ఆయన చిన్న పిల్లాడిలా తెగ సంతోష పడిపోయారని ఆ ఆనందం మా జీవితకాలమంతా గుర్తుపెట్టుకుంటామని చిరు అన్నారు.  కైకాల సత్యన్నారాయణ ఓ గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నా అంటూ చిరంజీవి తెలిపారు. ఈ ఏడాది జులైలో కైకాల ఆసుపత్రిలో ఉండగా హాస్పిటల్ బెడ్ పైనే కేక్ కట్ చేయించి ఆయన జన్మదిన వేడుకలు చేసిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఇదీ చదవండి: ఎస్వీ రంగారావు తర్వాత ఏకైక నటుడిగా కైకాలకే ఎందుకు గుర్తింపు.. ఆయనను ఎందుకు రిజెక్ట్ చేశారు..?

ఇవి కూడా చదవండి: