Home / jsp 10th formation day meet
ఇసుకేస్తే రాలనంత మంది జనసేన శ్రేణులు, ప్రజలు.. జనసేనాని పవన్ కళ్యాణ్ వెంట తరలి రాగా విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు వారాహి యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగింది. మార్గమధ్యంలో పెనమలూరు నియోజకవర్గం, ఈడ్పుగల్లు వద్ద అత్యవసర సర్వీసు అయిన అంబులెన్స్ వాహనాల మధ్య ఇరుక్కుపోవడంతో..
జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల నుంచి సభ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పుడు అభిమాన సముద్రం మధ్య విజయవాడ నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ మచిలీపట్నం బయలు దేరారు. అంతకుముందు బెంజ్ సర్కిల్ మీదుగా ఆటోనగర్ వారాహి వద్దకు పవన్, నాదెండ్ల మనోహర్ చేరుకునున్నారు.
ప్రశ్నించడం కోసమే అంటూ ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. సినిమా రంగంలో టాప్ స్టార్ హీరోగా ఉండి.. కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటూ.. లెక్కలేనంత అభిమాన సముద్రాన్ని సంపాదించుకున్న నిరంతర కృషీవలుడు పవన్ కళ్యాణ్. వాటన్నింటినీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల పక్షాన ఉంటూ వారి కోసం నిలబడ్డారు ఈ జనసేనాని.
పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. "దిగ్విజయ భేరి" పేరుతో జరగనున్న ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. బందరు శివర్లో 35 ఎకరాల్లో సభ ప్రాంగణం ఏర్పాట్లు చేశారు. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు.
ప్రస్తుతం తాజాగా పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతుంది. సాధారణంగానే పవన్ కి సంబంధించి ఏదైనా విషయం ఉందంటే ఆయన ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తారో తెలిసిందే. ఇక ఇప్పుడు ఒకేసారి రెండు విషయాలు కలిసి రావడంతో పవన్ పై అభిమానాన్ని చూపేందుకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ చెలరేగుతున్నారు.