Home / ISRO
ఎట్టకేలకు దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ 'అగ్నిబాణ్'ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన అగ్నిబాణ్ ను షార్‌లోని ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి గురువారం ఉదయం 7:15 గంటల సమయంలో రాకెట్‌ను సక్సెస్ ఫుల్‌గా ప్రయోగించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో మరో మైలురాయిని దాటింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. ఆదిత్య వ్యోమనౌక తన ప్రయాణంలో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకొని నేడు నిర్దేశిత కక్ష్యకి చేరుకుంది.
కొత్త ఏడాది తొలి రోజున ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి విజయవంతంగా వెళ్లింది. దీనితో ఈ ఏడాది ఇస్రోకు శుభారంభం లభించింది.
:భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్ యాన్ ’ లో కీలక సన్నాహక పరీక్ష టీవీ డీ1 పరీక్షను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. క్రూ మాడ్యుల్ ప్రయోగంలో భాగంగా సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ ను నింగిలోకి పంపింది.
ఆదిత్య ఎల్ వన్ మిషన్ తొలి ఘనతని సాధించింది. ఇప్పటికే నిర్ణీత కక్ష్య దిశగా పయనిస్తున్న ఆదిత్య సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడికి సంబంధించిన ఫొటోలని తీసింది. లాగ్రెంజ్ వన్ పాయింట్ దిశగా వెళుతోంది.
చంద్రయాన్-3 విజయం అనంతరం సూర్యుడి దిశగా ఇస్రో ప్రయోగాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్ఎల్వీ-సి57 వాహకనౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ తాజాగా ప్రయోగానికి వేదికైంది.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తన మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1ని సెప్టెంబర్ 2న ప్రారంభించనుంది. అంతరిక్ష నౌక శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి 11:50 గంటలకు బయలుదేరుతుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్‌పై చంద్ర యొక్క ఉపరితల థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ (చాస్టె) పేలోడ్ నుండి మొదటి పరిశీలనలను విడుదల చేసింది.
చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23, బుధవారం నాడు చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించే షెడ్యూల్లో ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది.అన్ని వ్యవస్థలు క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయని మరియు సాఫీగా సాగిపోతున్నాయని ఇస్రో తెలిపింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం చంద్రయాన్-2 ఆర్బిటర్ మరియు చంద్రయాన్-3 యొక్క లూనార్ మాడ్యూల్ మధ్య రెండు వైపులా కమ్యూనికేషన్ ఏర్పాటు చేయబడిందని తెలిపింది.స్వాగతం, మిత్రమా!' Ch-2 ఆర్బిటర్ అధికారికంగా Ch-3 LMని స్వాగతించింది.